Aa Kakarakaya Speciality: తింటే పసందు.. పోషకాలు మెండు..'బోడకాకరకాయ'తో విందు!

Aa Kakarakaya Speciality: తింటే పసందు.. పోషకాలు మెండు..బోడకాకరకాయతో విందు!
x
Highlights

Aa kakarakaya speciality: అదో రకం కూరగాయ. అది తింటే రోగాలు మట్టుమాయం అవుతాయి. చికెన్ ధర కంటే కూడా అధికంగా ఉంటుంది. రేట్ ఎంత ఎక్కువగా...

Aa kakarakaya speciality: అదో రకం కూరగాయ. అది తింటే రోగాలు మట్టుమాయం అవుతాయి. చికెన్ ధర కంటే కూడా అధికంగా ఉంటుంది. రేట్ ఎంత ఎక్కువగా ఉన్నాను జనం లెక్క చేయారు. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే అంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆహార ప్రియుల మనసు దోచుకుంటున్న ఆ కూరగాయ ఏమిటో చూడండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సహజ ఆహర పదార్థాలకు కొదవలేదు. అడవుల జిల్లాగా పిలిచే ఈ జిల్లాలో లభించే బోడకాకర కాయలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వర్షకాలంలో మాత్రమే పండే బోడకాకరకాయలను గిరిజనులు సేకరించి రోడ్లపై అమ్ముతుంటారు.

అడవుల్లో పండే బోడకాకరకాయలను తినడానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. బోడకాకరకాయలకు డిమాండ్ బాగా ఉండడంతో కిలో రెండు వందల రూపాయలు పలుకుతోంది. చికెన్ రేట్ కంటే అధికంగా ఉన్నాను బోడ కాకరకాయలను తినేందుకు జనం వెనుకంజవేయారు. ఒక్కసారైనా తినాల్సిందే అంటారు. ఇతర కూరగాయాలతో పోలిస్తే బోడకాకర కాయలలో అద్బుతమైన పోషకాలు ఉన్నాయి. షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. కంటితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను దూరం చేస్తోంది. జీర్ణ వ్యవస్థను చురుగ్గా పని చేయడానికి దోహదం చేస్తోంది. వర్షకాలం సీజన్ రాగానే ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకర కాయలు తినేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతారు. చికెన్ రేట్ కంటే కూడా అధికంగా ఉన్నాను లెక్క చేయకుండా తింటారు.



Show Full Article
Print Article
Next Story
More Stories