Viral Video: 12వ అంతస్తు నుంచి దూకే ప్రయత్నం.. చివరికి ఏమైందో తెలుసా.?

A Young Man From Noida Trying to Jump From Apartment Video Goes Viral in Social Media
x

Viral Video: 12వ అంతస్తు నుంచి దూకే ప్రయత్నం.. చివరికి ఏమైందో తెలుసా.?

Highlights

Viral Video: అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందని చెబుతుంటారు. అదే అదృష్టం బాగుంటే చావు కూడా తోక ముడుచుకుని పారిపోతుంది.

Viral Video: అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందని చెబుతుంటారు. అదే అదృష్టం బాగుంటే చావు కూడా తోక ముడుచుకుని పారిపోతుంది. ఇలాంటి సంఘటనలు అడపాదడపా మనం చూసే ఉంటాం. అదృష్టం బాగుంది కాబట్టి బచాయించాడు, ఇంకా ఈ భూమ్మీద నూకలు ఉన్నాయోమే అందుకే బతికిపోయాడు. ఇలాంటి మాటలు వినే ఉంటాం. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తుంటే ఈ మాటలు అక్షర సత్యమని చెప్పడంలో ఎలాంటి సందేహం. ఇంతకీ ఆ వీడియో ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న సూపర్‌ టెక్‌ కేప్‌ టౌన్‌ సొసైటీకి చెందిన ఓ యువకుడు అపార్ట్‌మెంట్‌లోని 12వ ఫ్లోర్‌ నుంచి కిందికి దూకే ప్రయత్నం చేశాడు. అయితే దూకే మందు ధైర్యం చాలలేదేమో కానీ గోడపై చేతులు పెట్టుకొని అలాగే ఉండి పోయాడు. దీంతో దీనంతటినీ పక్కన ఫ్లాట్స్‌ వాళ్లు చూస్తున్నారు. చేతులు ఏమాత్రం బ్యాలెన్స్‌ తప్పినా ఇక అంతే సంగతులు అనుకుంటున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు దేవుడిలా వచ్చారు.

ఈ విషయం గమనించిన వెంటనే హుటాహుటినా మెట్ల మార్గంలో పైకి ఎక్కారు. అనంతరం మొదట ఓ వ్యక్తి అతని దగ్గరికి రెండు చేతులతో ఒక్కసారిగా అతన్ని గట్టిగా పట్టేసుకున్నాడు. దీంతో అప్పటికే వచ్చిన మరో వ్యక్తి అతన్ని పైకి తీశారు. దీంతో కొంతలో చావు నుంచి బయట పడ్డాడు ఆ యువకుడు. దీనంతటికీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఆ వీడియో కాస్త వైరల్‌ అవుతోంది.

అయితే సదరు యువకుడు అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడని, ఇటీవల ఉద్యోగం పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అదృష్టం ఉంది కాబట్టి బతికిపోయాడంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కేవలం పిరికివాళ్లకు మాత్రమే వస్తుందంటూ యువకుడి తీరుపై మండిపడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories