ఇంట్రెస్టింగ్ స్టొరీ : ఆ ఊరు పేరే దీపావళి... ఎక్కడంటే ?

ఇంట్రెస్టింగ్ స్టొరీ : ఆ ఊరు పేరే దీపావళి... ఎక్కడంటే ?
x
Highlights

కొన్ని గ్రామాల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి..ఎంతలా అంటే వింటే మనకే ఆశ్చర్యం వేసేలా.. అందులో ఇది ఒకటి.. దీపావళి అనే గ్రామం ఉండడం ఇప్పుడు అందరిని...

కొన్ని గ్రామాల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి..ఎంతలా అంటే వింటే మనకే ఆశ్చర్యం వేసేలా.. అందులో ఇది ఒకటి.. దీపావళి అనే గ్రామం ఉండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ గ్రామం మరెక్కడో లేదండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ జిల్లాలోని బద్వేల్ అనే అసెంబ్లీ నియోజకవర్గంలోని, గార మండలంలో ఈ దీపావళి అనే గ్రామం ఉంది. అయితే ఈ ఊరు పేరు లాగే దీని వెనుక కూడా చాలా విచిత్రమైన కథ ఉంది..

చాలా సంవత్సరాల క్రితం ఓ ముస్లిం రాజు కళింగపట్నంలో తన పనులను ముగించుకొని ఇదే ప్రాంతం గుండా వెళ్తుండగా అక్కడ అతను అస్వస్థకు గురయ్యాడు. అక్కడి ప్రజలు అతని ఓ గడి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకి వైద్యాన్ని అందించి అతను కోలుకునేలా చేసారు. అస్వస్థత నుండి బయటకు వచ్చిన ఆ రాజు ఇది ఎం ప్రాంతమని అడిగాడట. అప్పుడు దీనికి అసలు పేరు లేదని వారు చెప్పుకోచ్చారట. ! ఈ సంఘటన దీపావళి రోజున జరగడంతో ఆ ఊరికి దీపావళి అని నామకరణం చేసాడని, అప్పుడు ఈ గ్రామానికి దీపావళి అనే పేరు వచ్చిందని చెప్పుకొస్తున్నారు ఇక్కడి గ్రామ ప్రజలు.. పండగ పేరుతో గ్రామం ఉండడంతో అక్కడి ప్రజలు చాలా గర్వంగా చెబుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సాధారణంగా అందరు ఒకరోజు, లేదా రెండు రోజులు దీపావళి జరుపుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఐదురోజులు దీపావళి జరుపుకుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories