Viral Video: ట్రైన్‌ జర్నీలో సమోసాలు తింటున్నారా.? ఇది చూస్తే జంకాల్సిందే..

A Person Take Back Samosas Which Fell Down in Running Train Video Goes Viral
x

Viral Video: ట్రైన్‌ జర్నీలో సమోసాలు తింటున్నారా.? ఇది చూస్తే జంకాల్సిందే..

Highlights

Viral Video: ట్రైన్‌ జర్నీలో ఉండే ఆ మజానే వేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత దూరంమైనా సరే ఎలాంటి బోర్‌ లేకుండా సాగిపోతుంది.

Viral Video: ట్రైన్‌ జర్నీలో ఉండే ఆ మజానే వేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత దూరంమైనా సరే ఎలాంటి బోర్‌ లేకుండా సాగిపోతుంది. దీనికి ప్రధాన కారణాల్లో జర్నీ చేస్తున్న సమయంలో వచ్చే ఫుడ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రైళ్లలో రకరకాల ఆహార పదార్థాలు అమ్మడానికి వస్తుంటాయి. వాటిని తింటూ హ్యాపీగా ప్రయాణం సాగించేస్తుంటారు. అయితే రైళ్లలో అమ్మకానికి వచ్చే ఫుడ్‌ నాణ్యతకు సంబంధించి అనుమానం కచ్చితంగా ఉంటుంది.

ఆ ఫుడ్‌ను ఎలా తయారు చేస్తారో.? తయారీకి ఎలాంటి ఆయిల్‌ను ఉపయోగిస్తారో అనే సందేహం ఉంటుది. అయితే రుచి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో తెగ లాగించేస్తుంటారు. కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే మాత్రం మరోసారి రైళ్లలో సమోసలు తినాలంటే భయపడాల్సి పరిస్థితి ఉంటుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.? అంతలా షాకింగ్ కలిగించే అంశాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

రన్నింగ్ ట్రైన్‌లో ఓ వ్యక్తి సమోసలు విక్రయిస్తున్నాడు. అయితే ఏమైందో ఏమో కానీ సమోసాలన్నీ బాత్‌రూమ్‌కి సమీపంలో కింద పడిపోయాయి. అయితే ఆ వ్యక్తి మాత్రం కింద పడ్డ సమోసలన్నింటినీ మళ్లీ బ్యాగులోకి వేసుకున్నాడు. వేల మంది నడిచే డర్టీ ప్రదేశంలో పడ్డ సమోసలను తిరిగి బ్యాగులో వేసుకోవడం షాకింగ్‌కి గురి చేస్తోంది. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి కెమెరాలో రికార్డ్‌ చేశాడు.

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఇంత దారుణమా.? మరోసారి రైలులో సమోసాలు తినాలంటే భయడే పరిస్థితి వచ్చింది అంటూ కామెంట్స్‌ చస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఆ వ్యక్తిని తిట్టి పోస్తున్నారు. ఏది ఏమైనా అవుట్ సైడ్‌ ఫుడ్‌ తినాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories