Viral Video: తొలిసారి గులాబ్‌ జామూన్‌ తిన్న కొరియన్‌ మహిళ.. రియాక్షన్‌ చూస్తే నోరు ఊరాల్సిందే..!

A Korean Woman Eating Gulab Jamun her Reacton Video Goes Viral
x

Viral Video: తొలిసారి గులాబ్‌ జామూన్‌ తిన్న కొరియన్‌ మహిళ.. రియాక్షన్‌ చూస్తే నోరు ఊరాల్సిందే..!

Highlights

Viral Video: గూలాబ్‌ జామూన్‌.. ఈ పేరు వినగానే నోరు ఊరడం ఖాయం. తియ్యగా ఉండే గులాబ్‌ జామున్‌ రుచిలో అమృతాన్ని తలపిస్తుంటుంది.

Viral Video: గూలాబ్‌ జామూన్‌.. ఈ పేరు వినగానే నోరు ఊరడం ఖాయం. తియ్యగా ఉండే గులాబ్‌ జామున్‌ రుచిలో అమృతాన్ని తలపిస్తుంటుంది. భారతీయులు ఎంతో ఇష్టంగా ఈ స్వీట్‌ను తింటుంటారు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కచ్చితంగా గులాబ్‌ జామూన్‌ ఉండాల్సిందే. పెళ్లిళ్లలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కచ్చితంగా ఈ స్వీట్‌ను సర్వ్‌ చేస్తారు. అంతలా రుచిగా ఉంటుంది మరి ఈ స్వీట్‌.

అయితే కేవలం భారతీయులకే సొంతమైన ఈ స్వీట్‌ను ఇటీవల ఓ కొరియన్‌ లేడీ ఆరగించింది. ఆ సమయంలో ఆమె ఇచ్చిన రియాక్షన్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కొరియాకు చెందిన కెల్లీ అనే ఓ మ‌హిళ ప్ర‌స్తుతం మహారాష్ట్రలోని పుణెలో ఉంటున్నారు. ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్‌ చేసే క్రమంలో ఆమె పుణెలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా ఆమె రోడ్డుపై ఓ స్వీట్‌ షాపులో గులాబ్‌ జామూన్‌ను ఆరగించింది. జీవితంలో మొదటిసారి గులాబ్‌ జామూన్‌ను తిన్న ఆ మహిళకు అసలు దానిని ఎలా తినాలో కూడా అర్థం కాలేదు. అయితే అక్కడున్న వారు చెబుతుంటూ స్పూన్‌తో గులాజ్‌ జామూన్‌ ముక్కను నోట్లో వేసుకుంది. అంతే మృదువుగా, తియ్యగా ఉన్న గులాబ్‌ జామూన్‌ రుచికి ఆమె ఫిదా అయ్యింది. వావ్‌ అంటూ అదిరిపోయే రియాక్షన్‌ ఇచ్చింది. ఇదంతా అక్కడే ఉన్న వారు వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ మహిళ రియాక్షన్ చూస్తేనే మన నోరు ఊరడం ఖాయమంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories