Gold Fish: బుజ్జి గోల్డ్ ఫిష్.. వాహనాన్ని నడిపెస్తోంది.. నమ్మట్లేదా.. ఈ వీడియో చూసేయండి!

Gold Fish: బుజ్జి గోల్డ్ ఫిష్.. వాహనాన్ని నడిపెస్తోంది.. నమ్మట్లేదా.. ఈ వీడియో చూసేయండి!
x

Gold Fish: బుజ్జి గోల్డ్ ఫిష్.. వాహనాన్ని నడిపెస్తోంది.. నమ్మట్లేదా.. ఈ వీడియో చూసేయండి!

Highlights

Gold Fish: గోల్డ్ ఫిష్ తమ కదలికతో వాహనాన్ని నియంత్రించగలదని .. నావిగేట్ చేయగలదని ఇజ్రాయెల్ పరిశోధకులు కనుగొన్నారు.

Gold Fish: గోల్డ్ ఫిష్ తమ కదలికతో వాహనాన్ని నియంత్రించగలదని .. నావిగేట్ చేయగలదని ఇజ్రాయెల్ పరిశోధకులు కనుగొన్నారు. వాటర్ ట్యాంక్ లోపల గోల్డ్ ఫిష్ చలనాన్ని పసిగట్టే వాహనం నడుస్తుంది. ఆ FOVవాహనం డేటాను సేకరించడానికి పల్సెడ్ లేజర్ కాంతిని ఉపయోగించే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ లైడార్‌తో అమర్చబడి ఉంది. గ్రౌండ్ లొకేషన్ .. వాటర్ ట్యాంక్ లోపల చేపల ఆచూకీ. ట్యాంక్ కంప్యూటర్, కెమెరా, ఎలక్ట్రిక్ మోటార్లు .. ఓమ్ని-డైరెక్షనల్ వీల్స్‌తో లోడ్ చేయబడిన ప్లాట్‌ఫారమ్‌పై అమర్చారు. వీటి సహాయంతో గోల్డ్ ఫిష్ వాహనాన్ని నడిపేలా ట్రైనింగ్ ఇచ్చు. వాహనం పైకి చేప చేరేలా ట్రైన్ చేశారు. తరువాత దానికి అమర్చిన ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ డివైస్ సహాయంతో వాహనాన్ని ఎలా నడపాలో దానికి సూచనలు అందించారు. దీంతో గోల్డ్ ఫిష్ ఆ వాహనాన్ని విజయవంతంగా చేపల తొట్టిలో అటూ ఇటూ తిప్పగలిగింది.

వాహనం నడపడం నేర్చుకోవడానికి చేపలకు ఎక్కువ సమయం పట్టలేదని పరిశోధకులు చెప్పారు. ఇప్పటివరకూ చేపలపై ఇటువంటి ప్రయోగం ఇదే మొదటిది. ఇంతదాకా ఆరు గోల్డ్ ఫిష్‌లకు వాహనాన్ని నడపడాన్ని నేర్పించారు. వాటిలో ఒక్కొక్కదానికి దాదాపు పది డ్రైవింగ్ పాఠాలు చెప్పారు. వాహనం నడపడం కోసం ఒక జంతువును ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కుక్కలు, పిల్లులు .. ఎలుకలను వాహనం నడపడం కోసం ఉపయోగించారు. ఈ ఆవిష్కరణ ప్రత్యేకమైనది, అయితే ఈ ప్రయోగం ఫలితాలు వేరే దగ్గర ఎక్కడైనా ఉపయోగించబడతాయో లేదో పరిశోధకులు వెల్లడించలేదు.

వీడియో మీరూ చూసేయండి:

Show Full Article
Print Article
Next Story
More Stories