200 సంవత్సరాల చరిత్ర కలిగిన సైకిల్‌

Bicycle With a History of 200 Years‌
x

200 సంవత్సరాల చరిత్ర కలిగిన సైకిల్‌

Highlights

Bicycle: పేదవాడి ఖరీదైన వాహనంగా సైకిల్‌కి స్థానం

Bicycle: 20 సంవత్సరాల వెనక్కి వెళితే ప్రతి ఇంట్లో కచ్చితంగా సైకిల్ ఉంటూ వచ్చేది. ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ పైన వెళుతూ ఉండేవాళ్ళు. సినిమాలకు షికార్లకు కూడా తన కుటుంబ సభ్యులతో సైకిల్ పై వెళ్ళేవారు. సైకిల్ కు దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఎవరింట్లో చూసినా మోటార్‌ వాహనాలు కనబడుతోంది. ఒకపక్క మారిన జీవన విధానం వల్ల శారీరక శ్రమ లోపించి మనుషులు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతే కాక మోటార్‌ సైకిళ్లను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తూ ఉండడంతో పర్యావరణానికి కూడా ముప్పుగా మారింది. వాహనాల నుండి వస్తున్న కాలుష్యం వల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి మనిషి జీవన విధానాన్ని బాగా దెబ్బతీస్తున్నాయి.

చాలా ప్రపంచ దేశాలలో ఇప్పటికీ సైకిల్ వాడమని నాలుగు కిలోమీటర్ల లోపు వారి వారి కార్యాలయాలకు వచ్చేలాగా ప్రోత్సహిస్తుంది. అంతే కాదు అలా వచ్చిన వారికి కొంత నగదు రూపంలో సహాయం కూడా అందిస్తుంది. దానికి కారణం పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలలో చాలా దేశాలు ఈ పద్ధతులను పాటిస్తున్నాయి. సైకిల్ తొక్కడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని, చాలా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ 19 ప్రత్యేకించి శ్వాస కోశానికి సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి లంగ్స్‌ని ఎటాక్ చేసి వాటి పని తీరుని బలహీన పరుస్తుంది. అందుకని, ఆరోగ్యంగా ఉన్న వారూ, కొవిడ్ సోకి రికవర్ అయిన వారూ కూడా ఊపిరి తిత్తులని బలంగా చేసే ఎక్సర్సైజెస్ చేయడం అవసరం. కొద్దిగా ఆయాసపడేలా చేసే ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా లంగ్స్‌కి మంచిదే. రోజూ ప్రాక్టీస్ చేస్తే, సైక్లింగ్ వల్ల గాఢంగా ఊపిరి పీల్చి వదిలే సామర్ధ్యం వస్తుంది. ఇది లంగ్స్ ఆరోగ్యానికి సహకరిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories