Viral: ఈ అరటి పండు ధర అక్షరాల రూ. 52 కోట్లు.. అంతలా ఏముందనేగా.?

A Banana Taped to Wall Sold for RS 52 Crores in Auction
x

Viral: ఈ అరటి పండు ధర అక్షరాల రూ. 52 కోట్లు.. అంతలా ఏముందనేగా.?

Highlights

Viral: ఒక అరటి పండు ధర ఎంత ఉంటుంది.? రూ. 5 మహా అయితే.. ఓ రూ. 10 ఉంటుంది.

Viral: ఒక అరటి పండు ధర ఎంత ఉంటుంది.? రూ. 5 మహా అయితే.. ఓ రూ. 10 ఉంటుంది. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఉండదు. అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న అరటి పండు మాత్రం ఏకంగా రూ. 52 కోట్లు. ఓ వేలంలో ఈ అరటి పండు రూ. 52 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. ఒక అరటి పండు రూ. 52 కోట్లు పలకడం ఏంటి.? అసలు అందులో ఉన్న అంత ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోడకు టేపుతో అతికించిన ఈ అరటి పండును అమెరికాలోని న్యూయార్క్‌లో వేలంలో ఉంచారు. బనానా టేప్ పేరుతో ఈ ఆర్ట్‌ వర్క్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇటాలియన్‌ ఆర్టిస్ట్‌ మౌరిజియో కాటెలాన్‌ సృష్టించిన బనానా టేప్‌ను సోథ్‌బే సంస్థ వేలంలో ఉంచింది. ఈ అరటి పండును క్రిప్టోకరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిన్‌ సన్‌ రూ. 52 కోట్లకు సొంతం చేసుకున్నారు. కమెడియన్‌ పేరిట చేసే ఈ అరటి పండు ఆర్ట్‌వర్క్‌ను 2019లో తొలిసారి మియామి బీచ్‌ ఆర్ట్‌ బాసెల్‌లో ప్రదర్శించారు.

అయితే ఈ ఆర్ట్‌వర్క్‌లో భాగంగా ప్రతి మూడురోజులకోసారి అరటిపండును మారుస్తుంటారు. బనానా టేప్‌ను ఒక కళాఖండంగా భావిస్తూ పెద్ద ఎత్తున వేలం నిర్వహిస్తూ వస్తున్నారు. 2019లో నిర్వహించిన వేలంలో ఈ అరటి పండు సుమారు రూ. 98 లక్షలకు అమ్మడుపోయింది. ఇలా ప్రతీసారి ఈ అరటి పండు ధర పెరుగుతూనే పోతోంది. ప్రస్తుతం ఈ అరటి పండు వేలానికి సంబంధిచిన న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇది తెలిసిన నెటిజన్లు అరటి పండుకు రూ. 52 కోట్లు ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే 2023లో దక్షిణ కొరియాలో ఓ మ్యూజియంలో ఈ బనానా ఆర్ట్‌ను నిర్వహించగా ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మ్యూజియంకు వచ్చిన ఓ విద్యార్థి అరటి పండును తినేసి తిరిగి తొక్కను టేప్‌తో అతికించాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించగా ఆకలేసి తినేశానని సమాధానం ఇచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories