Pro Kabaddi Play off: ప్రోకబడ్డీ ప్లే ఆఫ్ కి చేరిన జట్లివే

Pro Kabaddi Play off: ప్రోకబడ్డీ ప్లే ఆఫ్ కి చేరిన జట్లివే
x
Highlights

ప్రోకబడ్డీ సీజన్ ఏడు లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. శుక్రవారంతో లీగ్ దశ ముగుస్తుంది. అయితే, ఇప్పటికే ఆరు జట్లు ప్లే ఆఫ్ కి అర్హత సాధించాయి....

ప్రోకబడ్డీ సీజన్ ఏడు లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. శుక్రవారంతో లీగ్ దశ ముగుస్తుంది. అయితే, ఇప్పటికే ఆరు జట్లు ప్లే ఆఫ్ కి అర్హత సాధించాయి. జూలై 20 న ప్రారంభమైన ఈ సుదీర్ఘ టోర్నీ లీగ్ దశలో మొత్తం 12 జట్లు డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడ్డాయి. పాయింట్ల పట్టికలో టాప్ 6 లో నిలబడిన జట్లు తదుపరి రౌండ్ లో తలపడతాయి. ఈ లీగ్ లో దబాంగ్ ధిల్లీ, బెంగాల్ వారియర్స్, హర్యానా హీలర్స్, యు ముంబా, బెంగళూర్ బుల్స్ ప్లే ఆఫ్ కి అర్హత సాధించాయి.

మొత్తం 21 మ్యాచ్ లు ఆడిన దబాంగ్ ధిల్లీ జట్టు 15 మ్యాచ్లు గెలిచింది. నాలుగు మ్యాచ్ లు ఓడింది. రెండు మ్యాచ్ లు టై గా ముగిసాయి. దీంతో మొత్తం 82 పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానాన్ని సాదించింది. బెంగాల్ వారియర్స్ 21 మ్యాచ్ ల్లో 13 గెలిచి, ఐదు ఒడి, మూడు టైగా ముగించడం ద్వారా 78 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక హర్యానా స్టీలర్స్ 21 మ్యాచ్ లు ఆడి 13 మ్యాచ్లు గెలిచింది. ఏడూ మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్ టైగా ముగించుకుని 70 పాయింట్లతో మూడో స్థానం లో నిలిచింది. ఇక యూపీ యోదా 20 మ్యాచుల్లో 12 గెలిచి, ఆరు ఒడి, 2 టైగా ముగిచ్బి 68 పాయింట్లతో నాలుగో స్థానం లోనూ, యూ ముంబాయి 20 మ్యాచుల్లో 11 గెలిచి, ఎనిమిడి ఒడి, ఒక్క మ్యాచ్ టై గా ముగించి 64 పాయింట్లతో ఐదో స్థానం లోనూ, బెంగళూరు బుల్స్ 21 మ్యాచుల్లో 11 గెలిచి, 9 ఓడి, ఒక్కటి టైగా ముగించి 64 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ కి అర్హత సాధించాయి.

ఇక తెలుగు టైటాన్స్ జట్టు తానాడిన 21 మ్యాచుల్లో కేవలం 5 మ్యాచులు మాత్రమె గెలిచింది. 13 మ్యాచుల్లో ఓడిపోయి, మరో రెండు మ్యచుల్ని టైగా ముగించింది. ఆ జట్టు 40 పాయింట్లు సాధించి పట్టికలో చివర నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories