ప్రోకబడ్డీ: తెలుగు టైటాన్స్ పైకి వచ్చేనా?

ప్రోకబడ్డీ: తెలుగు టైటాన్స్ పైకి వచ్చేనా?
x
Highlights

12 జట్లు.. 137 మ్యాచ్‌ల సుదీర్ఘ లీగ్.. ఆరు జట్ల ప్లేఆఫ్.. ఇదీ సింపుల్ గా ప్రో కబడ్డీ టోర్నమెంట్. కానీ, ఈపోరులో ప్రారంభం నుంచి చివరి వరకూ అంచనాలు...

12 జట్లు.. 137 మ్యాచ్‌ల సుదీర్ఘ లీగ్.. ఆరు జట్ల ప్లేఆఫ్.. ఇదీ సింపుల్ గా ప్రో కబడ్డీ టోర్నమెంట్. కానీ, ఈపోరులో ప్రారంభం నుంచి చివరి వరకూ అంచనాలు మారిపోతాయి. జట్ల స్థానాలూ మారిపోతాయి. కచ్చితంగా ఈ జట్లే ప్లే ఆఫ్ కు వస్తాయని చెప్పడం చాలా కష్టం. ఈరోజు మ్యాచ్ లో అదరగొట్టిన ఆటగాళ్లు తరువాతి మ్యాచ్ లో ఘోరంగా విఫలం కావచ్చు. తక్కువ పాయింట్లే చేసిన జట్టు కూడా తన ప్రత్యర్థిని కట్టడి చేసి ముందుకు దూసుకుపోవచ్చు. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక్కో జట్టూ తమ ప్రత్యర్థి తో లీగ్ దశలో రెండు సార్లు తలపడుతుంది. చివరికి పాయింట్ల పట్టికలో మొదటి ఆరు స్థానాల్లో నిలిచినా జట్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి.

ప్రో కబడ్డీ లీ సీజన్ 7 ప్రారంభమై నెల (జూలై 20) నెల గడిచిపోయింది. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన తెలుగు టైటాన్స్ జట్టు పదో స్థానంలో ఉందిప్పుడు. ఇప్పటికే 50 మ్యాచ్ లు పూర్తయిపోయాయి. ఇప్పటి వరకూ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటివరకూ తానాడిన 9 మ్యచుల్లో 7 గెలుచుకుంది. ఇక తెలుగు టైటాన్స్ జట్టు 9 మ్యాచుల్లో రెండంటే రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఐదు మ్యాచ్‌లు ఓడింది. మరో రెండు టై చేసుకుంది. దీంతో పదోస్థానంలో ఉంది.

ఇప్పుడు ఇక పాయింట్ల పట్టికలో పైకేగాబాకాలంటే దాదాపుగా ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఉంది. లేదా పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్ల ఆటతీరుపై తెలుగు టైటాన్స్ అదృష్టం ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకూ టైటాన్స్ జట్టు సరైన ఆటతీరు కనిపర్చలేదు. ముఖ్యంగా రైడర్లు ఆ జట్టుకి అనుకున్నంత స్థాయిలో రాణించక పోవడం సమస్యగా మారింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి లేకపోవడం టైటాన్స్ లోటుగానే కనిపిస్తోంది. ఈ లోటును అధిగమించి గాడిలో పడాలంటే కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. మరి వీరెంతవరకూ లాక్కోస్తారో వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories