బరువు తగ్గాలంటే ఈ టీ తాగండి

ఒక చిన్న అల్లం ముక్కను దంచి 1 గ్లాసు నీటిలో వేసి తక్కువ మంట మీద మరగనివ్వాలి. నీళ్ళు సగానికి వచ్చిన తర్వాత వడగట్టి చల్లారిన తర్వాత తాగాలి.
బరువు తగ్గాలనుకునేవారు అల్లం నీటిలో తేనె కలుపుకుని తాగవచ్చు.
అల్లం నీటిని మరిగించి వడపోసి అందులో నిమ్మరసం కలుపుకుని తాగితే బరువు తగ్గుతారు.
అల్లం, దాల్చిన చెక్కను గ్రైండ్ చేసి నీళ్లలో మరిగించి ఆ నీటిని వడపోసి తాగాలి.ఈరెండూ కూడా కొవ్వును బర్న్ చేస్తాయి
అల్లం, పసుపు కలుపుకుని టీ తయారు చేసుకుని తాగితే బరువు కంట్రోల్లో ఉంటుంది.
అల్లం నీళ్లలో మరిగించిన తర్వాత అందులో గ్రీన్ టీ వేసి తాగవచ్చు. ఇది బరువును అదుపులో ఉంచుతుంది.
అల్లం టీ తాగడం వల్ల వాంతులు, వికారం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది.