ఈ ఆకుకూరలతో థైరాయిడ్ నార్మల్ అవ్వడం ఖాయం

ఆకుకూరల్లో ఉండే పోషకాలు మరే ఇతర ఆహార పదార్థాల్లోనూ ఉండవని న్యూట్రీషియన్లు చెప్తూ ఉంటారు. ఆకుకూరలు సహజసిద్ధమైన పోషక వనరులు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి.
కొన్ని రకాల ఆకుకూరలను తీసుకోవడం వల్ల ప్రత్యేక రకమైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాంటి వ్యాధుల్లో థైరాయిడ్ కూడా ఒకటి.
థైరాయిడ్ ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి హైపర్ థైరాయిడిజం, రెండోది హైపో థైరాయిడిజం.
హైపర్ థైరాయిడిజం అనేది థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా శరీరంలో విడుదల అవడం వల్ల కలుగుతుంది. దీనివల్ల అసాధారణంగా బరువు తగ్గే ప్రమాదం ఉంది. అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని తగ్గించుకోవచ్చు.
హైపర్ థైరాయిడిజం కంట్రోల్ చేసుకోవాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.
ముఖ్యంగా పాలకూరలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది థైరాక్సిన్ హార్మోన్ ను కంట్రోల్ చేస్తుంది.
తోటకూరలో కూడా ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కూడా మీ శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది.
బచ్చలి కూరలో కూడా ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కూడా థైరాక్సిన్ హార్మోన్ కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఎర్ర తోటకూరలో కూడా ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. వీటిని తీసుకుంటే కూడా థైరాయిడ్ హార్మోన్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.