తెల్ల వెంట్రుకలు రావడానికి కారణాలివే

వయస్సు పెరుగుతున్నా కొద్దీ వెంట్రుకల కుదుళ్లు తక్కువ మెలనిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇది జుట్టు రంగుకు కారణమయ్యే వర్ణద్రవ్యం. ఇది తక్కువగా విడుదలవ్వడంతో వెంట్రుకలు తెల్లగా మారుతాయి.
మీ జుట్టు ఎప్పుడు తెల్లగా మారుతుందనేది జన్యుపరమైన కారణం కూడా ఉంటుంది.
దీర్ఘకాలిక ఒత్తిడి జుట్టును తెల్లగా మారుస్తుంది.
అవసరమైన విటమిన్లు,మినరల్స్ అందనప్పుడు వెంట్రుకలు తెల్లగా మారుతాయి. బి12 లోపం వెంట్రుకలను తెల్లగా మారుస్తుంది.
శరీరంలోని ఫ్రీ రాడికల్స్ , యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుంది.
ధూమపానం కూడా తెల్లవెంట్రుకలు రావడానికి కారణం అవుతుంది.
బొల్లి లేదా అలోపేసియా అరేటా వంటి పరిస్థితులు కూడా మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది.
సమతుల్య ఆహారం, ఒత్తిడి లేని జీవన శైలి కారణంగా జుట్టును ఎక్కువగా నల్లగా ఉంచుకోవచ్చు.