శీతాకాలంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఇవే..డ్రైవ్ చేయాలంటే ధైర్యం ఉండాల్సిందే
భారతీయ రహదారులు
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లు భారత్ ఉన్నాయి. ఈ రోడ్లపై డ్రైవ్ చేయాలంటే ధైర్యం చేయాల్సిందే. ముఖ్యంగా శీతాకాలంలో ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి.
ప్రమాదకరమైన రోడ్లు
భారత్ శీతాకాలంలో ప్రయాణించడానికి అత్యంత ప్రమాదకరమైన టాప్ 8 రోడ్లు ఏవో చూద్దాం.
జోజిలా పాస్-జమ్మూకశ్మీర్
జోజిలా పాస్ శ్రీనగర్ నుంచి లేహ్ వరకు ఉంటుంది. రహదారి నిటారుగా ఉన్న వాలులు, మంచు తుఫానులు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడ ప్రయాణించాలంటే సాహసం చేయాల్సిందే.
స్పితి వ్యాలీ,హిమాచల్ ప్రదేశ్
శీతాకాలంలో భారీ హిమపాతం, రాళ్లతో స్పితి వ్యాలీ డేంజరస్ గా ఉంటుంది. ఇది భారతదేశపు అత్యంత ప్రమాదకరపు రోడ్లలలో ఒకటి.
ఖర్ధుంగ్ లా, లడఖ్
ఖర్దుంగ్ లా లడఖ్ లోని ఎత్తైన ప్రదేశం. భారీ మంచు, హిమపాతాలు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలతో తీవ్రమైన శీతాకాల పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ప్రయాణించడం చాలా డేంజరస్
చాంగ్ లా పాస్, లడఖ్
చాంగ్ లా పాస్, ప్రపంచంలోనే ఎత్తైన రహదారుల్లో ఒకటి. మంచు పేరుకుపోవడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ తరచు మంచు తుఫానులను సంభవిస్తుంటాయి.
ఉత్తరాఖండ్ కుమావోన్ ప్రాంతం
ఉత్తరాఖండ్ లోని కుమావోన్ ప్రాంతంలో ఇరుకైన, వంకరగా ఉండే రోడ్లు శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే చాలా ప్రమాదకరం
లేహ్ మనాలి
లేహ్ మనాలి హైవే దాని ఎత్తైన ప్రదేశాలకు, శీతాకాలంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. మంచు తుఫానులు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, కొండచరియలు చలికాలంలో ప్రయాణికులకు ప్రమాదకరమైన మార్గంగా ఉంటాయి.
సర్చు, హిమాచల్ ప్రదేశ్
మంచు తుఫానులు, ఉష్ణోగ్రతల కారనంగా సర్చు రహదారి చాలా భయంకరంా ఉంటుంది. ఇక్కడ ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.