మనదేశంలో అందమైన గ్రామాలు ఇవే..మీ పిల్లలకు తప్పకుండా చూపించాల్సిందే
పూవార్, కేరళ
కేరళ రాష్ట్రంలోని పూవర్ గ్రామం చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రామాన్ని మీరు పిల్లలతో కలిసి చూడవచ్చు.
మలానా, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ లోని ఈ మలానా గ్రామం ఎంతో పురాతనమైంది. కులు వ్యాలీలోని ఈశాన్య దిశగా ఈ గ్రామం ఉంటుంది. స్వచ్చమైన గాలి, అందమైన ప్రదేశాలను ఆస్వాదించవచ్చు.
మజులి
అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్రనదిలో ఉన్న ద్వీపం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం. దానిపేరే మజులి.
కింసార్ , రాజస్థాన్
రాజస్థాన్ రాష్ట్రంలోని ఈ గ్రామం ఉంటుంది. థార్ ఎడారిలో ఈ గ్రామం ఉంది.
యానా, కర్నాటక
కర్నాటకలోని గోకర్ణకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చిన్న గ్రామం. తీర్ ప్రాంతంతో చాలా అందంగా ఉంటుంది.
నాకో
హిమాలయాల్లోని ఉంటుంది ఈ నాకో గ్రామం. టిబెట్ సరిహద్దుల్లోని గ్రామం ఎంతో అందంగా ఉంటుంది.
మాలిన్నాంగ్
ఈశాన్య భారతదేశంలోని మేఘాలయలోని మాలిన్నాంగ్ గ్రామం ఉంటుంది. ఎంతో అందమైన గ్రామం ఇది. 2003లో ఈ గ్రామం ఆసియా ఖండంలోని పరిశుభ్రమైన గ్రామంగా అవార్డును కూడా పొందింది.
మున్సియారీ, ఉత్తరఖాండ్
ఉత్తరాఖాండ్ లోని మున్సియారీ గ్రామం కుమాన్ పర్వతాల్లో ఉంటుంది. టిబెట్ లోని ఈ గ్రామం చాలా అందంగా ఉంటుంది.