బొప్పాయి పండే కాదు..ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

బొప్పాయి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. బొప్పాయి ఆకుల్లో ఉండే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మీ బ్లడ్ షుగర్ పెరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బొప్పాయి ఆకులను జ్యూసుగా చేసుకుని తాగితే చాలు. ఇందులో ఉండే మూలకాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి.
డెంగ్యూ వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తోంది. ప్లేట్ లెట్స్ తగ్గుతుంటాయి. దీన్ని నివారించేందుకు బొప్పాయి ఆకుల రసం తాగాలి. దీంతో ప్లేట్ లెట్స్ వేగంగా పెరుగుతాయి.
బొప్పాయి ఆకుల్లో ఉండే మూలకాలు శరీరాన్ని డిటాక్షిఫై చేయడంలో మేలు చేస్తాయి. ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది. చర్మం మెరిచేలా చేస్తుంది.
బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల పేగు లోతుగా శుభ్రపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల వెంట్రుకలు ధ్రుడంగా మారడంతో పాటు ఎదుగుదల మెరుగుపడుతుంది. ఈ జ్యూస్ జుట్టు రాలే సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
బొప్పాయి ఆకుల రసం తాగితే ఇమ్యూనిటి పెరుగుతుంది. కండరాలను బలంగా ఉంచుతుంది. దీంతో వైరల్ వ్యాధుల ప్రమాదం, కాళ్లలో నొప్పి కూడా దూరం అవుతుంది.
బొప్పాయి ఆకుల రసం చాలా చేదుగా ఉంటుంది. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తాగాలి. ఆరోగ్యంగా ఉండాలంటే వారానికోసారి ఈ జ్యూస్ తాగవచ్చు.
మీరు బొప్పాయి ఆకుల రసం తాగాలంటే ముందుగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే తాగండి.