కొత్త ఏడాదిలో ఫిట్‎గా ఉండాలంటే జాగింగ్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే

ఎనర్జీ లెవల్స్
ప్రతిరోజూ జాగింగ్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ మెరగవుతుంది.మీ శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అలసట తగ్గుతుంది.
మంచి నిద్ర
జాగింగ్ చేస్తే మంచి నిద్ర వస్తుంది. నిద్ర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
గుండెకు మేలు
జాగింగ్ అనేది గుండెను బలంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ జాగింగ్ చేస్తే రక్తపోటు కూడా తగ్గుతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు తగ్గుతాయి.
శ్వాస సమస్యలు
జాగింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుంది.
బరువు తగ్గడం
కేలరీలను బర్న్ చేయడానికి, బరువు కంట్రోల్లో ఉంచుకునేందుకు జాగింగ్ చాలా ఉపయోగపడుతుంది.
మానసిక ఆరోగ్యం
జాగింగ్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇది మంచి మూడ్ బూస్టర్. జాగింగ్ చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది.
కండరాలు, ఎముకలు బలంగా
జాగింగ్ చేయడం వల్ల కండరాలు, ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకల సంబంధిత సమస్యలు తగ్గించడంలో దోహదం చేస్తుంది.
ఇమ్యూనిటీ
రెగ్యులర్ గా జాగింగ్ చేస్తే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
హెల్తీ స్కీన్
జాగింగ్ చేస్తే రక్త ప్రసరణ మెరగవుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆక్సిజన్ సరఫరా కూడా పెరుగుతుంది.