జామకాయ చలికాలంలో విరిగా లభిస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో నిండి ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి.
జీర్ణశక్తి
జామకాయలో విటమిన్ సి అధికమోతాదులో ఉంటుంది. రోజుకో జామపండును తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
విటమిన్ సి
జామపండులో విటమిన్ సి ఉంటుంది. నారింజలో కంటే ఎక్కువ జామపండులో ఉంటుంది. జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. మీ రోగనిరోధకశక్తినిపెంచడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గించడంలో
లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న జామపండులో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ఆక్సీకరణ నష్టాన్ని నివారించడం ద్వారా గుండెను రక్షించడంలో సహాయపడుతుంది. జామపండు గుండెకు ఆరోగ్యకరమైన పండు.
రక్తంలో షుగర్
జామ పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మధుమేహానికి అనుకూలమైన పండు. రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. షుగర్ ఉన్నవారికి అద్భుతమైన పండు
థైరాయిడ్
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రోజుకో జామపండు తినడం వల్ల ఈ కీలక గ్రంథికి సహాయపడుతుంది.
జీర్ణక్రియ
రోజుకో జామకాయ తింటే జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. జామఆకులు అతిసారాన్ని నయం చేస్తాయి.