New Year Wishes in Telugu: న్యూ ఇయర్ విషెస్ తెలుగులో ఇలా చెప్పండి

కొత్త ఏడాదికి మీ స్నేహితులకు, బంధువులకు విషెస్ చెప్పాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే తెలుగులో ఇలా చెప్పండి. అందమైన విషెస్ మీకోసం
కొత్త ఏడాదిలో సరికొత్త ఉత్సాహంతో ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త ఏడాదిలో మరింత ముందుకు సాగిపోవాలని మనసారా కోరుకుంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు
కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లోనూ విజయం సాధించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్
ఎన్నో ఆశలను మోసుకువస్తున్న ఈ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
సంబురాలు మిన్నంటే వేళ నింగినేలా కాంతుల హేళ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు
కష్టాలు ఎన్నైనా రానీ సవాళ్లు ఎన్నానైనా సమర్థవంతంగా ఎదుర్కొని కలిసి నిలుద్దాం, గెలుద్దాం. ఈ ఏడాదికి విజయాలను అందించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్
పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మీ అందరి మనస్సులు కూడా మంచి ఆలోచనలతో నిండి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు
మనం కొత్త ఏడాదిని స్వాగతిస్తున్నప్పుడు గత ఏడాదిలో మనం పంచుకున్న క్షణాలను గుర్తుచేసుకుందాం. హ్యాపీ న్య ఇయర్
ఈ కొత్త ఏడాది మీకు ప్రేమ, నవ్వు, మరపురాని క్షణాలను ఇవ్వాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు