బడ్జెట్ ధరకే iPhone SE 4 .. లాంచ్ ఎప్పుడంటే

ఆపిల్ డిసెంబర్ 2024లో iPhone SE 4 ఉత్పత్తిని ప్రారంభించనుంది.
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 2025 మొదటి త్రైమాసికంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
సమాచారం ప్రకారం ఆపిల్ డిసెంబర్ 2024 - మార్చి 2025 మధ్య సుమారు 8.6 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
ఆపిల్ ఐఫోన్ SE 4, SE 4 ప్లస్ రెండిటిని బడ్జెట్ సెగ్మెంట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. 
ఐఫోన్ SE 4 మొబైల్ 6.1-అంగుళాల డిస్‌ప్లేతో ఐఫోన్ 14 మాదిరిగానే కనిపిస్తుంది.
ఐఫోన్ SE 4 ప్లస్ పెద్ద 6.7 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది.
ఫోన్‌లో కొత్త  A18 చిప్‌సెట్ ఉంటుంది.
ఇది ఐఫోన్ SE 4కి కొన్ని Apple ఇంటెలిజెన్స్ ఫీచర్లను అందిస్తుంది. 
iPhone SE 4లో సింగిల్-లెన్స్ వెనుక 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
ఫేస్ ID SE 4 ట్రూడెప్త్ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.