ఈ జంతువు పాలు ఒక్క గ్లాసు తాగితే షుగర్ ఫాస్టింగులో 120 దాటదు

ఒంటె పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. రాజస్థాన్, గుజరాత్‌లో ఈ పాలను తాగుతారు. ఇది రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా మధుమేహం, కొలెస్ట్రాల్ సహా ఇతర వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఒంటె పాలలో పోషకాలు ఆవు, గేదె పాలతో సమానంగా ఉంటాయి . ఇందులో సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. విటమిన్ సి, బి, కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం అధికంగా ఉంటాయి.
ఒక కప్పు ఒంటె పాలలో 110 కెలోరీలు, ప్రోటీన్: 5 గ్రాములు, కొవ్వు: 4.6 గ్రాములు, సంతృప్త కొవ్వు: 3 గ్రాములు, కార్బోహైడ్రేట్లు: 11 గ్రాములు, షుగర్: 8 గ్రాములు లభిస్తాయి.
పాలు తాగితే అలెర్జీ వచ్చే వారికి ఒంటె పాలు ఒక మంచి చాయిస్. ఎందుకంటే ఒంటె పాలలో ఇతర పాల ఉత్పత్తుల కంటే భిన్నమైన ప్రోటీన్ ఉంటుంది - ఇది అలెర్జీలను పెంచదు.
ఒంటె పాలు రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు ఒంటె పాలు తాగితే, మీ ఫాస్టింగ్ షుగర్ స్థాయి కూడా తగ్గుతుంది.
రాజస్థాన్ లోని ఒక తెగ వారు ప్రతి రోజు ఒంటె పాలు తాగుతారు. వీరిలో టెస్ట్ చేస్తే ఒక్కరికి కూడా డయాబెటిస్ లేదని తేలింది. వారు ఒంటె పాలను క్రమం తప్పకుండా తాగడమే కారణమని నిర్ధారించారు.
ఒంటె పాలలో చర్మానికి మంచి కాంతిని అందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. తద్వారా చర్మం ముడతలు పడదు.
ఒంటె పాలలో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మానికి యాంటీ ఏజింగ్ లక్షణాలను అందించడంతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.
అయితే పచ్చి ఒంటె పాలను ఎప్పుడూ తాగకూడదు, ఎల్లప్పుడూ మరగబెట్టిన తర్వాత మాత్రమే వీటిని వాడాలి. ఒంటె పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, మీరు మీ శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు