మీ జుట్టు వేగంగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

పొడవాటి జుట్టు
పొడవాటి జుట్టు ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. కానీ నేటి కాలంలో పొల్యూషన్, ఆహారం, ఇతర అలవాట్లతో జుట్టు పెరుగుదల తగ్గింది.
ఆరోగ్యకరమైన జుట్టు
అయితే మీకు పొడవాటి జుట్టు కావాలనుకుంటే కొన్ని చిట్కాలను ఫాలో అవుతే మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఆ చిట్కాలేంటో చూద్దాం.
హెల్తీ ఫుడ్
మీ జుట్టు బలంగా పెరగాలంటే సరైన పోషకాలు అవసరం. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకుంటే జుట్టు పెరుగుతుంది.
ప్రొటీన్
జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్ తయారు అవుతుంది. గుడ్లు, చేపలు, లీన్ మాంసాలు, చిక్కుళ్లు వంటి వాటిలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.
బయోటిన్
జుట్టు పెరుగుదలకు బి విటమిన్ చాలా అవసరం. బయోటిన్ అధికంగా ఉండే ఫుడ్స్ లో గింజలు, చిలకడదుంపలు, బచ్చలికూర ఉన్నాయి.
ఒమేగా 3
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ కొవ్వులు హెయిర్ ఫొలికల్స్ ను పోషిస్తాయి. చేపలు, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ ల నుంచి ఒమేగా 3 పొందవచ్చు.
స్కాల్ప్ మసాజ్
స్కాల్ప్ మసాజ్ అనేద రక్త ప్రసరణను పెంచుతుంది. హెయిర్ ఫోలికల్స్ కు మరిన్ని పోషకాలు అందించడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
సిల్క్ పిల్లోకేస్
మీరు పడుకొనేటప్పుడు సిల్క్ పిల్లోకేస్ ను ఉపయోగించండి. ఇవి జుట్టు రాలడం, చిక్కుబడటాన్ని తగ్గిస్తాయి.
ఐరన్ లోపం
ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. రెడ్ మీట్, కాయధాన్యాలు తీసుకోవాలి.