ఈ గింజలు తింటే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది

జుట్టును పెంచే గింజలు
నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాల్నట్స్, బాదం, పిస్తా, జీడిపప్పులు తింటే మీ జుట్టు పొడుగ్గా, బలంగా పెరుగుతుంది. అంతేకాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
రకరకాల పోషకాలు
ఈ గింజల్లో పోషకాలెన్నో ఉంటాయి. ఇవి మన చర్మాన్ని జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
బాదం
నానబెట్టిన బాదం పప్పులను రోజూ తింటే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పుప్పుల్లో బయోటిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం అధికమోతాదులో ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందించడంతోపాటు బలంగా ఉంచుతాయి.
జీడిపప్పు
జీడిపప్పుల్లో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటుంది. ఈ పప్పులను తింటే జుట్టుకు మంచి పోషణ అందుతుంది. మీ జుట్టు పొడుగ్గా, బలంగా ఉండాలంటే మీరు డైట్లో జీడిపప్పును చేర్చుకోవడం మంచిది.
పిస్తా
పిస్తాలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పప్పులను తింటే జుట్టు రాలడం తగ్గుతుంది. మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
వాల్ నట్స్
వాల్నట్స్ ను తింటే మీ జుట్టు వేగంగా పెరుగుతుంది. ఇందులోని పోషకాలు జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి.జుట్టు రాలడం, చిట్లిపోవడం చాలా వరకు తగ్గుతుంది. చలికాలంలో జుట్టు మంచి షైనీగా కనిపిస్తుంది.
వేరుశనగ
వేరుశనగలు కూడా మీ జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే బయోటిన్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. హెయిర్ ఫాల్ తగ్గించి జుట్టును బలంగా ఉంచుతాయి.
పైన్ గింజలు
వీటిలో జుట్టుకు అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. ఈ గింజలు మన జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. జుట్టును బలంగా, పొడుగ్గా పెరిగేలా సహాయం చేస్తాయి.