ఈ ఏడాది దీపావళి ఎప్పుడు.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1?

ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలన్న గందరగోళం చాలా మందిలో ఉంది. అక్టోబర్ 31నా లేదా నవంబర్ 1నా, లక్ష్మీపూజ ఎప్పుడు ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దీపావళి గురువారం అక్టోబర్ 31, 2024న జరుపుకుంటారు. లక్ష్మీదేవి పూజకు అనుకూలమైన సమయం ఏదో చూద్దాం.
లక్ష్మీ పూజ అక్టోబర్ 31న సాయంత్రం 6.54 నుంచి 8.33 మధ్య జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
ప్రదోష కలం అక్టోబర్ 31 సాయంత్రం 6.02 నుంచి ప్రారంభమై రాత్రి 8.33 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయంలో పూజ, దీపాలు వెలిగించేందుకు అనుకూలమైన సమయం
దీపావళినాడు 6.54 నిమిషాల నుంచి 8.54 వరకు లక్ష్మీపూజకు వ్రుషభ కాలాన్ని నిర్ణయిస్తారు. ఈ సమయంలో పూజ చేస్తే సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది.
అక్టోబర్ 31న మధ్యాహ్నం 3.52 గంటలకు అమావాస్య ప్రారంభం అవుతుంది. ఇది కొత్త చాంద్రమాన మాసానికి పరివర్తనను సూచిస్తుంది.
అమావాస్య తిథి నవంబర్ 1 సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది.
అక్టోబర్ 31వ తేదీన దీపావళి జరుపుకోవడం శుభప్రదమని, వ్రతప్రాయంగా మంచిదని పండితులు తీర్మానించారు.