2024వ సంవత్సరంలో కొంతమందికి మరుపురాని జ్ఞాపకంగా ఉంటే మరికొందరికి చేదుగా మిగిలిపోయింది. ఈ ఏడాది కొంతమంది సెలబ్రిటీలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. వారెవరూ చూద్దాం.
ధనుష్-ఐశ్వర్య
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రీసెంటుగా అధికారికంగా విడిపోయారు. 2004లో వీరిద్దరూ పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. 18 ఏళ్ల పాటు వైవాహిక బంధానికి ముగింపు పలికారు.
ఏఆర్ రెహమాన్- సైరా భాను
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భాను విడాకుల ప్రకటన ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. 1995లో వివాహం చేసుకున్న వీరికి ముగ్గురు సంతానం. 29 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడాకులు ప్రకటించారు.
ఊర్మిళ- మోసిన్ అక్తర్ మీర్
ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ, మోసిన్ అక్తర్ మీర్ 2016లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత తన భర్త మోహిన్ అక్తర్ మీర్ నుంచి ఆమె విడాకులు తీసుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
జయం రవి - ఆర్తి
కోలీవుడ్ హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 15 ఏళ్ల వారి వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
జీవి ప్రకాష్ కుమార్ - సైంధవి
ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్, తన చిన్ననాటి స్నేహితురాలైన సింగర్ సైంధవిని 2013లో వివాహం చేసుకున్నారు. అయితే 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది విడాకులు ప్రకటించారు.
ఇషా డియోల్-భరత్ తక్తాని
బాలీవుడ్ నటి ఇషా డియోల్-భరత్ తక్తాని దంపతులు11 ఏళ్ల వారి వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. వీరికి రాధ్య, మిరయా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వీరి డైవర్స్ పై ఎన్నో రూమర్స్ వ్యాపించినా దానికి కారణాన్ని మాత్రం వెల్లడించలేదు
హార్ధిక్ ప్యాండ్యా -నటాషా
భారత క్రికెటర్ హార్ధిక్ ప్యాండ్యా, మోడల్ నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్నారు. 2020లో డేటింగ్ చేసి మరీ వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి ఈ ఏడాది ముగింపు పలికారు.
సానియా మీర్జా -షోయబ్ మాలిక్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పెళ్లి అప్పట్లో చర్చనీయాంశమైంది. 14 ఏళ్ల తర్వాత ఈ జంట ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు.