చలికాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? బెంగళూరులో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు ఇవే

కూర్గ్
దట్టమైన కాఫీ తోటలు, పొగమంచుతో నిండిన కొండలు, కొడవ సంస్క్రుతికి ప్రసిద్ధి చెందిన కూర్గ్ శీతాకాలంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.
చిక్కమగళూరు
కర్నాటక అంటేనే కాఫీ తోటలకు ఫేమస్. చిక్కమగళూరులోని కాఫీ తోటలు శీతాకాలపు ప్రక్రుతి అందాలను మరింత ఉత్తేజపరుస్తాయి.
వయనాడ్
బెంగళూరు నుంచి కేవలం కొన్ని గంటల్లోనే వయనాడ్ చేరుకోవచ్చు. ఇక్కడి చల్లని వాతావరణం, జలపాతాలు, వన్యప్రాణాలతో చలికాలపు విహారయాత్రకు అనువైంది.
మైసూర్
రాజరిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన మైసూర్ ఆహ్లాదకరమైన చలికాలపు వాతావరణానికి ప్రసిద్ధి. మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, బ్రుందావన్ గార్డెన్స్ వంటి అందమైన ప్రదేశాలను చూడవచ్చు.
హంపి
హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. హంపి పురాతన శిథిలాలు, బండరాళ్లతో కూడిన ప్రక్రుతి ద్రుశ్యాలు, గొప్ప చరిత్రను కలిగిఉంది. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయ సముదాయం, తుంగభద్ర నదిని చూడవచ్చు.
కబిని
కబిని ప్రశాంతమైన శీతాకాలపు వన్యప్రాణులను చూడవచ్చు. కబిని రివర్ లాడ్జికి వెళ్తే నాగర్ హోల్ నేషనల్ పార్కులో బోట్ సఫారీలు, అటవీ మార్గాలు, పక్షుల వీక్షణను ఆనందించవచ్చు.
ఏర్కాడ్
చాలా మందికి తెలియని ఈ హిల్ స్టేషన్ దాని సుందరమైన సరస్సు, కాఫీ తోటలు, ఆహ్లాదకరమైన శీతాకాలపు వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.
ఊటీ
శీతాకాలం ఊటీలోని సరస్సులు, బొటానికల్ గార్డెన్స్ తిలకించవచ్చు. నీలగిరి మౌంటైన్ రైల్వే, టీ మ్యూజియం కూడా సందర్శించవచ్చు.
సకలేష్ పూర్
ఈ పట్టణం చుట్టూ కొండలు, కాఫీ తోటలు ఉన్నాయి.శీతాకాలంలో మంజరాబాద్ కోట, బిస్లే ఘాట్, హేమావతి రిజర్వాయర్స్ ను చూడవచ్చు.