"మీరే నేటి నాయకుడు కాగలరు"

మీరే నేటి నాయకుడు కాగలరు
x
Highlights

ఫ్రండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం "మీరే నేటి నాయకుడు కాగలరు". ఒక నాయకుడి ప్రభావం, ఆ నాయకుడి చుట్టూ వున్నవారిపైన ఎలావుంటుందో....బాహుబలి...

ఫ్రండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం "మీరే నేటి నాయకుడు కాగలరు".

ఒక నాయకుడి ప్రభావం, ఆ నాయకుడి చుట్టూ వున్నవారిపైన ఎలావుంటుందో....బాహుబలి సినిమాలోని, యుద్ధం సన్నివేశంలో చాలా బాగా చూపాడు దర్శకుడు రాజమౌళి. ముఖ్యంగా యుద్ధం సన్నివేశం జరుగుతువున్నప్పుడు, తన మాహిష్మతీ సైన్యం..భయంతో మరణం.....మరణం... అని పరిగెడుతుంటే, అసలైన నాయకుడైన బాహుబలి, తన మాటలను మంత్రాలలా ఎలా వాడి ప్రభావితం చేసాడో మీరు చూసే వుంటారు.

బాహుబలి...ఆ క్షణంలో అంటాడు "మహాసేనా! ఏది మరణం..... మన గుండె ధైర్యం కన్న శత్రువు బలగం పెద్దదీ అనుకోవడం మరణం... రణ రంగంలో చావుకన్న పిరికితనంతో బ్రతికుండడం మరణం.... మన తల్లిని అవమానించిన నీచుడు కళ్లెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే .... వాడి తల నరికి అమ్మ పాదాలకింద పాతకుండ వెన్ను చూపి పారిపోవడం మరణం.. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను...నాతో వచ్చేదెవరు???? నాతో గెలిచేదెవరు????? ఆ మరణాన్నిదాటి నాతో బ్రతికేదెవరు????? జై మాహిష్మతీ...అంటాడు. అంతే ఆ సైన్యంలో వచ్చిన, ఆ గొప్ప మార్పుని మీరు వెండితెరపై చూసేవుంటారు. అందుకే ఫ్రండ్స్ ఈ రోజుల్లో అన్ని రంగాలలో కావాల్సింది, సమాజానికి కావాల్సింది...అలాంటి నాయకులు.

మనలో చాలామందికి జీవితంలో గొప్ప విజయాలు సాదించాలని కోరిక వుంటుంది. గొప్ప ఉద్యోగాలు చెయ్యాలని కోరికవుంటుంది...అయితే ఈ రోజుల్లో ఒక వ్యక్తికి మంచి టెక్నికల్ స్కిల్స్ వుంటే, ఒక ఉద్యోగం వస్తుంది, అదే టెక్నికల్ స్కిల్స్తో పాటు మేనేజిరియల్ స్కిల్ల్స్ వుంటే ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది. కాని ఎవరికైతే వీటితో పాటే... పీపుల్ స్కిల్స్ లో ఒకటైన లీడర్షిప్ స్కిల్ వుంటే మాత్రం, వారి భవిషత్తు బంగారు బాటలా వుంటుంది. వారు కోరుకునే గొప్ప ఉద్యోగం, ఆదాయం, అభివృద్ధి అన్ని సాద్యం అవుతాయి.

అయితే ఒక నాయకుడు అంటే, అది ఆ పొజిషన్ వలన వచ్చే పవర్ మాత్రమే కాదు. ఆ వ్యక్తి వ్యక్తిత్వం తో వచ్చేది కూడా. అందుకే అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులను, సతీష్ ధావన్ లాంటి నాయకులు, వారి వ్యక్తిత్వంతో ప్రోత్సహించి అద్బుతాలు చేసారు. ముఖ్యంగా ఒక నాయకుడు ఇతరులు చూడలేని ఎన్నో అవకాశాలను చూడగలడు, ఇతరులు చెయ్యలేని పనులను, అసాద్యలను, సుసాద్యంగా తను చెయ్యగలడు. అలాగే ఇతరులు చూడలేనిది, చేయలేనిది, మనం చేస్తే మనలో కూడా ఒక నాయకుడు ఉన్నాడని అర్థం.

ఒక నాయకుడు తమపై వచ్చే సమస్యల బాణాలని తన మీదకి ముందుగా తీసుకుంటాడు. ఒక మంచి నాయకుడు తను ముందు వుండి, తన టీం అందరిని నడిపిస్తాడు. అలా వుండటం వలెనే మహేందర సింగ్ దోని "ఇండియన్ క్రికెట్ టీం కాప్టైన్" గా ఎన్నో విజయాలు పొందాడు. మీరు ఒక మంచి నాయకుడిలా ఇతరులను లీడ్ చెయ్యాలని అనుకుంటే మాత్రం, ముందుగా మనని మనం లీడ్ చేసుకోగలగాలి. కాబట్టి ఒక మంచి లీడర్కి వుండే ముఖ్య లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాము.

మొదటిది...భవిష్యత్తుకు సంబంధించిన ఇన్స్పైరింగ్ విజన్ తయారుచేసుకోవాలి.

ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి మనందరిని తీసుకువేల్లెవాడే ఒక మంచి లీడర్. తనకి వున్న దార్శనికత లేదా విజన్ వలన అది సాదిన్చగలడు.

రెండవది....ఆ విజన్ డెలివరీ చెయ్యడానికి సంబంధించిన బాద్యత తీసుకోవాలి.

తను కోరుకున్న ఉన్నత స్థితిని అందించే బాధ్యతని, పూర్తిగా తన భుజస్కంధాల పైన నాయకుడు వేసుకుంటాడు. తన చుట్టూ వున్న వారికీ అభివృద్ధి ఫలితాలు అందించడానికి ఎంతో కృషి చేస్తాడు. అంటే తన చుట్టూ వున్న వారి కలలు కూడా తానే కంటాడు. వాటిని నెరవేర్చే బాద్యతను కూడా తీసుకుంటాడు.

మూడవది....ఆ పనిలో బాగమైన వ్యక్తులకు సరైన శిక్షణ, కోచింగ్ ఇవ్వాలి.

తాము కోరకున్న ఉన్నత స్థితికి చేరడానికి, తన చుట్టూ వున్నా టీం వ్యక్తులకు సరైన శిక్షణని అందిస్తాడు, అలాగే సరైన వ్యక్తికి సరైన బాద్యతలు కొన్ని ఒప్పచెప్పగలడు.

నాలుగోవది..........అందరిని మోటివేట్ చేస్తూ, ఇన్స్పిరేషన్ ఇస్తూ ముందుకు నడపాలి.

ఒక కార్య సాధనలో తన టీం మెంబెర్స్ ఎప్పుడైనా, నిరుత్సాహం కి గురి అయిన కూడా, వారిని తిరిగి కార్యోన్ముఖున్ని చేయగలడు. అందుకై తను ఎప్పుడు మంచి మానసిక స్థితిలో వుంటాడు. ఎందుకంటే ఫీల్ బెటర్ గా వున్నవాడే, బెటర్ గా డీల్ చేయ్యగలడు కాబట్టి.

ఫ్రండ్స్! ఈ లక్షణాలను మనలో పెంచుకోవడం ద్వార, మనం ఒక మంచి నాయకుడిగా మారగలము. అయితే మీ జీవితం, మీ ఫాలోవర్స్ జీవితం మారాలంటే మాత్రం, ముందుగా మీరు చేసే కొన్ని పనులు కూడా మారలి. కాబట్టి ఇప్పుడు ఒక మంచి లీడర్ చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో ఇప్పుడు చూద్దాము.

మొదటిది...ఒక నాయకుని విలువని అందించే, ఎ పనులను ఎక్కువగా చెయ్యాలో నిర్ణయించుకోండి.

మీరు మరియు మీ చుట్టూ వున్నవారు, ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎ పనులు మీరు చేస్తే ఎక్కువ విలువని అందించగలరో, ఆ పనులు ఎక్కువ చెయ్యండి.

రెండవది.......ఒక నాయకుడిగా మీ సమయం ఎక్కడ వృధా అవుతుందో చూడండి.

నాయకుడికి సమయం చాల విలువైనది..ఆ సమయం మీరు ఎక్కడైనా వృధా చేస్తున్నారా చూసుకోండి, అలాగే మీరు చేసే పనులు, మీ నమ్మకస్తులు చెయ్యగలరని మీకు అనిపిస్తే, వారికీ ఆ బాద్యతలు ఒప్పచేప్పండి. ఎందుకంటే పనిని, సరైన వ్యక్తులకు ఒప్పచెప్పటం కూడా ఒక మంచి నాయకుడి లక్షణం.

మూడవది.....మీకు అనవసరమైన పనులు చెయ్యడం ఆపేయండి.

మీరు చేసే ఎ పనులు మీ లక్ష్యానికి పెద్దగా ఉపయోగపడట్లేదో గమనించి, ఆ పనులను చేయడం ఆపేయండి. ఎందుకంటే మీ సమయం అమూల్యం అయినది కాబట్టి.

నాలుగవది.....మీ భవిష్యత్తుకు ఉపయోగపడే పనులను కొత్తగా మొదలెట్టండి.

మీరు చేయాలని అనుకున్న, సమయం లేక చెయ్యలేక పోతున్న పనులను, ఇప్పుడు తప్పక చేయండి, ఇలా చేయడం వలెనే కొత్త ఫలితాలు వస్తాయి, ఒక నాయకుడిగా మీరు అనుకున్న ఫలితాలను సాదిస్తారు.

ఫ్రెండ్స్ చివరిగా..బారతదేశ స్వతంత్ర అవసరాన్ని నమ్మి, తనని తాను మార్చుకున్నాడు కాబట్టే, మోహన్దాస్ కరంచంద్ గాంధీ, మన దేశానికి ఒక మహానాయకుడిగా, ఒక మహాత్ముడిగా మారాడు. ఒక నాయకుడిగా మీరు కావడానికి, మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది అంత ముఖ్యం కాదు, కానీ ఎక్కడికి వెళుతున్నారు అనేది మాత్రం ముఖ్యం. సో ఫ్రెండ్స్! ఈ రోజు మనం తెలుసుకున్న ఈ విషయాలని ఆచరణలో పెట్టడం ద్వార, మంచి నాయకుడిగా మీరు ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories