ఫ్రెండ్స్! మీరు ఇప్పుడు ఎలాంటి నిస్సహాయ స్థితిలో వున్నా కూడా, మీ అసలైన, అంతర్గత శక్తి గురించి తెలుసుకోవడం ద్వార, దాని వాడటం ద్వార... మీ జీవితం యొక్క...
ఫ్రెండ్స్! మీరు ఇప్పుడు ఎలాంటి నిస్సహాయ స్థితిలో వున్నా కూడా, మీ అసలైన, అంతర్గత శక్తి గురించి తెలుసుకోవడం ద్వార, దాని వాడటం ద్వార... మీ జీవితం యొక్క ప్రతి పరిస్థితిని మీరు మార్చుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఫ్రెండ్స్! మీరు అల్లా ఉద్దీన్ అద్భుత దీపం కథ విన్నారా. ఆ కథలో అల్లాఉద్దీన్ వద్ద వున్న దీపములోనుండి ఒక "జిని" బయటకు వచ్చి, అల్లాఉద్దీన్తో... "నేను జిని భూతాన్ని, ఈ దీపం ఎవరి దగ్గర ఉంటే.. వాళ్లు చెప్పినట్టల్లా నేను చేస్తాను. ఇప్పుడు మీరే నా యజమాని..అని వంగి నమస్కరిస్తూ....మీకు ఏం కావాలో సెలవు ఇవ్వండి..?" అని అల్లా ఉద్దీన్ని అడిగింది, ఆ తర్వాత అతను ఎ పని చెప్తే ఆ పని చేసింది. అలా తనకు కావాల్సినవి అన్నిటిని...ఆ శక్తితో అల్లాఉద్దీన్ సంపాదించుకొని చివరికి తన జీవిత సినిమాకి శుభం కార్డు వేసుకున్నాడు.
ఫ్రండ్స్ ! మీకు ఎప్పుడైనా అలాంటి అద్భుత దీపం మీ దగ్గర కూడా వుంటే బాగుంటుంది అని అనిపించిందా? ఒకవేళ మీ దగ్గర కూడా అలాంటి అద్భుత దీపం వుంటే, మీరు ఏమి కోరుకుంటారు...................ఎలాంటి విషయాలు, వస్తువులు, కోరికలు సాధించుకుంటారు.
ఫ్రెండ్స్ అలాంటి అద్బుత శక్తి మనలోనే దాగివుందట. అవును... నిజంగానే...అలాంటి శక్తి మనలోనే ఉందట....
కానీ అది ఒక దీపం రూపంలో కాకుండా, మన బుర్రలో వచ్చే ఆలోచనల రూపంలో ఉన్నాయట. మన ఆలోచనలే మన అనుభవాలకి అచ్చుముద్రల్ల పని చేస్తున్నాయట. అయితే మన మనసులోకి ఒక రోజూలో సగటున ఎన్ని ఆలోచనలు వస్తాయి అని చూస్తే, మనకి దాదాపు 60 వేల ఆలోచనలు వస్తాయని అంచనా. అవునా... అరవై వేలా..అని ఆశ్చర్యపోకండి..ఎందుకంటే మనం గుర్తించేవి కొన్నే వుంటాయి...వాటిని కాన్షియస్ ఆలోచనలు అంటారు. ఎక్కువ మాత్రం సబ్ కాన్షియస్ ఆలోచనలే వస్తాయట. కాబట్టి అన్ని మనం గుర్త్తిన్చలేము. కాని మన ఆలోచన కాన్షియస్ అయినా, సబ్ కాన్షియస్ అయినా కూడా, మనము ఏదైతే ఎక్కవగా ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలకు అనుగుణంగా ఫలితాలు ఉత్పత్తి అవుతాయట. అలా జరగటానికి మూల సూత్రం మాత్రం, అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటి, మన ఆలోచన అనే దీపపు వెలుగుకి వున్న శక్తి అని చెప్పవచ్చు. దీనిని ఇప్పుడు చాలామంది లా అఫ్ అట్రాక్షన్ అని పిలుస్తున్నారు.
ఫ్రెండ్స్ మీరు ఈ లా అఫ్ అట్రాక్షన్ అనే విషయం గురుంచి విన్నారా? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే విషయం గురించి ఒక్క వ్యాక్యంలో చెప్పాలి అంటే, ' మీరు ఎ విషయంపై ద్రుష్టి పెడతారో, ఆ విషయాన్ని మీ జీవితంలో మీరు ఆకర్షిస్తారు అని". అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే విషయం ముఖ్యంగా "రోండా బర్న్" అనే రచయిత్రి 2006 లో వ్రాసిన "సీక్రెట్" అనే పుస్తకం నుండి బాగా ప్రచారం వచ్చింది. అలాగే దానికి సంబంధించిన వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎంతో ప్రచారం పొందిది. మీరు ఈ వీడియోని యు ట్యూబ్ లో కూడా చూడవచ్చు.
ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు దేనిమీదనైతే మీ శ్రద్దని, మీ శక్తిని పెడతారో, అదే మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. అంటే మీ జీవితంలోని మంచి విషయాలపై, పాజిటివ్ విషయాలపై మీ దృష్టిని కేంద్రీకరిస్తే, మీ జీవితంలో అలాంటివే ఎక్కువగా వస్తాయి.
అలా కాకుండా మీరు ఎక్కువగా సమస్యలపై మీ దృష్టిని పెడితే అలాంటి సమస్యలే ఎక్కువగా ఆకర్షిస్తారు. కొద్దిమంది వారి జీవితంలో ఇతరుల వల్ల బాధితులుగా భావిస్తు, మరియు తరచూ తమ గత భాదాకరమైన సంఘటనలను గుర్తుకు చేస్తూ బాధపడుతూ వుంటారు. ఇలా వుంటే వుంటే మాత్రం....ఇంకా ఎన్నో ఇబ్బందులే వస్తుంటాయి అని లా అఫ్ అట్రాక్షన్ టీచర్స్ అంటారు.
ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, ఎవరైనా ఎందుకు వారికి నష్టపరిచే విషయాలని, సమస్యలని కోరుకుంటారు, అందరూ తమకు ఉపయోగపడే, లాభాన్ని ఇచ్చే వాటినే కోరుకుంటారు కదా అని.
మనలో చాలామందికి ఈ ఆకర్షణా సిద్ధాంతం, లేదా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో తెలియక పోవడం వల్ల, వారికి తెలియకుండానే ఎన్నో సమస్యలను, ఇబ్బందులను వారు ఆకర్షించుకుంటారట. అదెలా అంటే.... ఎప్పుడైతే మనం మనకు ఏది వద్దో, ఎ సమస్యలకి దూరంగా ఉండాలనుకుంటున్నమో, ఎ ఇబ్బందులు రావద్దనుకుంటమో, చివరికి అవే ఎక్కువ రావచ్చు.
అలా ఎందుకు అంటే ఉదాహరణకి...మనం " ఒక నల్ల పిల్లి గురించి మీరు ఆలోచించకండి, ఇప్పుడు అస్సలు ఆ నల్ల పిల్లి కళ్ళ గురించి అలోచిన్చకండి...అని నేను మీతో చెప్పిన...రిక్వెస్ట్ చేసిన కూడా....మీకు ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటో చూడండి....మీకు తెలిసిందా ఎ ఆలోచన వస్తోందో.. ఆ నల్ల పిల్లి వచ్చిందా!
ఫ్రెండ్స్ ఈ కారణం వల్లే మనం ఏది వద్దు అనుకుంటే, అది మన అద్భుత దీపంలోని భూతం తీసుకువస్తుందట. ఇలా జరగవద్దు అంటే... మనకి ఏది వద్దో కాకుండా, మనకి ఏది కావాలో మనం ఆలోచించాలి. అప్పుడే.....మనకి కావాల్సిన విషయాలు మన జీవితంలో వస్తాయి. అలా ఈ లా అఫ్ అట్రాక్షన్ ద్వార తప్పక మనం కోరుకునేవి పొందుతాము. దీన్నే మన పెద్దవారు "యద్భావం తద్భవతి" అన్నారు. యద్భావం అంటే మన అంతర్గత ఆలోచనలు మరియు మన మనోవైఖరి అని అర్ధం. అలాగే తద్భవతి అంటే ప్రదర్శించబడటం లేదా ఫలితం అనే అర్థం వస్తుంది. ఇలా ఇతిహాసాల్లో కూడా మన ఆలోచనల, భావనల యొక్క ప్రభావం మన జీవిత అనుభవాలాలో ఎలా ఉంటుందో చెప్పారు.
ఇది ఎలా సాద్యం, ఇది ఏమైనా మేజిక్లా పని చేస్తుందా అని కొద్దిమందికి అనుమానం రావచ్చు, ఈ అనుమానం చాల సహజం. ఇది అర్ధం చేసుకోడానికి ఒక ఉదాహరణ చూద్ధాం. మనం ఎప్పుడైనా ఒక మేజిక్ షో చూసినప్పుడు... వారు చేస్తున్న మేజిక్ చూసి, మనకి చాల ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇది ఎలా సాద్యం అయ్యింది... అనే అనుమానం వస్తుంది.
కాని ప్రతి మేజిక్ వెనకాల ఒక లాజిక్ వుంటుంది, మనకు తెలియని ఒక సైన్స్ వుంటుంది. ఆ సైన్స్ ప్రకారమే ఒక మెజీషియన్ పని చేస్తాడు. అలాగే ఈ లా అఫ్ అట్రాక్షన్ వెనక కూడా ఒక సైన్స్ వుంది. మనం శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ సృష్టి లోని ప్రతి పదార్థ మూలం...లేదా వస్తువులు, జీవులు అన్నిటి యొక్క మూలంలో ఎనర్జీ ఉంటుది.
అయితే అన్నిటిలో ఒకే ఎనర్జీ వుంటే...మరి ఎన్ని ఒకేలా లేకుండా, వేరు వేరు రూపాల్లో ఎందుకు వున్నాయి? అని అనిపిస్తుంది. అన్నిటి ఎనర్జీ ఒకటే అయిన, ఒక్కో దాంట్లోని ఎనర్జీ యొక్క వైబ్రేషన్ విబిన్నంగా వుండటం వల్ల, ఇవన్ని మనకి రకరకాల రూపంలో కనబడుతున్నాయి.
దీనికి మన కోరికల సాధనకి సంబంధం ఏంటంటే, మనం కోరుకునే దాని మూలం ఎనర్జీనే, అలాగే మన ఆలోచనలు కూడా ఎనర్జీ నే ...అందువల్ల మన ఆలోచనలకి అనుగుణంగా మన మాట, మన పని, మన ఫలితాలు కూడా వస్తాయి. దీని వెనక ఇంకా ఎన్నో విషయాలు వున్నా, ఫ్రెండ్స్! సమయాభావం వల్ల ఇప్పుడు మనం అర్ధం చేసుకోవాల్సింది...మన ఆలోచనలు చాల శక్తివంతమైనవని, అయితే మనకి ఏది వద్దో కాకుండా...మనకి ఏమి కావాలో మాత్రమే ఎక్కువగా ఆలోచించాలని........... సో ఫ్రండ్స్! ఇప్పడు మీరు తెలుసుకున్న విషయాన్నీ, మీ జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తారో ఆలోచించండి. దానిమీదే మీ దృష్టిని పెంచండి....ఇలా ఈ ఒక్క విషయంలో మీరు మార్పు తీసుకువచ్చినా, ఎన్నో గొప్ప ఫలితాలను మీరు మీ జీవితంలో పొందగలరు. అల్ ది బెస్ట్ ఫ్రండ్స్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire