బంధంలో నమ్మకం పాత్ర!

బంధంలో నమ్మకం పాత్ర!
x
Highlights

ముఖ్యంగా మానవ సంబంధాలు రోజు రోజుకి స్వార్ధంతో నిండిపోతున్నాయని కొద్ది మంది వాపోతారు. వాటికీ ముఖ్య కారణం ఏంటి అని ఆలోచిస్తే...ఒకరి మీద ఒకరికి నమ్మకం రోజు రోజుకి తగ్గడం ఒక కారణం.

ఒక సారి... శ్రీను అతని బాస్ తో '' సార్‌..! నాకు ఒక గంట పర్మిషన్‌ ఇస్తే ఇంటికెళ్ళోస్తాన్‌..'' అన్నాడు.

'' ఎందుకోయ్‌. పొద్దున్నే మీ ఆవిడను పుట్టింటికి బస్సెక్కించి వచ్చానన్నావు. ఇక నీకు ఇంటి దగ్గర పనేముంటుంది..?'' అన్నాడు బాస్.

'' మా యిద్దరికీ పెళ్లయ్యాక మొట్టమొదటిసారిగా మా భార్య పుట్టింటికి వెళ్ళింది. నా భార్యలేని ఇల్లు ఎంత హాయిగా, ప్రశాంతంగా ఉందో చూడాలని ఉంది సార్‌..!'' అన్నాడు శ్రీను ఆత్రంగా. ఇది జోక్ అయిన కూడా ఎక్కడో వాస్తవానికి దగ్గరలోనే వుంది.

ముఖ్యంగా మానవ సంబంధాలు రోజు రోజుకి స్వార్ధంతో నిండిపోతున్నాయని కొద్ది మంది వాపోతారు. వాటికీ ముఖ్య కారణం ఏంటి అని ఆలోచిస్తే...ఒకరి మీద ఒకరికి నమ్మకం రోజు రోజుకి తగ్గడం ఒక కారణం. అలాగే ఆర్దిక వ్యవస్థలో వస్తున్న మార్పులు కూడా ఒక కారణం. కాని కొన్ని బంధాలను మాత్రం, ప్రతి ఒక్కరు ఎప్పటికి కాపాడుకోవాల్సిన అవసరంవుంది. కొన్ని ముఖ్యమైన బంధలైన, బార్యభర్తల బంధంలో నమ్మకాన్ని పెంపొందించుకోవాల్సివుంది. అలాగే కుటుంభ సంబందాలలో తల్లిదండ్రులకు పిల్లలకు, గురువు కు శిష్యుల మద్య నమ్మకం ఎంతో ఉండాల్సిన అవసరం వుంది. కానీ కొద్ది మంది బంధాలు వారికీ ప్రతిబంధకాలు అవుతున్నాయని వాపోతున్నారు. ఈ బంధాల బరువు లేకుంటే బాగుండునేమో అనుకుంటున్నారు.

ఇంకా ఎలాగో అలా ఇతరులను తమ తెలివితో మేనేజ్ చెయ్యవచ్చు అని కూడా కొద్దిమంది నమ్ముతారు. అలాంటి వారు ఎప్పుడో ఒకప్పుడు దొరకటం ఖాయం అని తెలుసుకోరు. ఎదుటి వ్యక్తి నమ్మకాన్ని, అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆడుకుంటారు..అదెలా అంటే...

విమలకు కొత్తగా పెళ్ళయింది. కూతుర్ని చూడ్డానికి వచ్చిన తల్లి '' అమ్మా! విమలా అల్లుడుగారూ నిన్ను ఎలా చూసుకుంటున్నారే?'' అంది.

'' చాలా బాగా చూసుకుంటున్నారమ్మా! నిదట్లో కూడా నన్నేతల్చుకుంటున్నారు. కానీ...'' అంటూ ఆపి పడీ పడీ నవ్వసాగింది.

'' ఎందుకు అలా నవ్వుతున్నావ్‌?''

'' ఏందలేదమ్మా...! ఆయనకు నా పేరు సరిగా గుర్తుండక నిద్దట్లో రమ ముద్దుపెట్టు, కళ్యానీ కౌగిలించుకో అంటూ రకరకాల పేర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు అంది...

ఇలాంటి అమాయకమైన విమలలు కూడా ఏదో ఒకరోజు విషయాన్ని గుర్తించి దుర్గావతారం ఎత్తగలరు అని గుర్తించాలి. కాబట్టి వీలైనంతవరకు మన బంధాలలో నమ్మకాన్ని పెంచుకోవాలి. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories