మీ జీవితం ఎవరి బాధ్యత?

మీ జీవితం ఎవరి బాధ్యత?
x
Highlights

బాధ్యత ఇది చాలా క్లిష్టమైనది. చాలా మందికి ఇష్టం లేనిది. బాధ్యత తీసుకోవడం అంటే భయం కొందరికి. బద్ధకం మరికొందరికి. అసలు ఆ పదం అంటేనే చిరాకు చాలా మందికి. ఎవరి జీవితానికి వారే బాధ్యులు అన్న నిజాన్ని గుర్తించకపోతే జీవితాన్నే నష్టపోతారు.

ఒక అర్థరాత్రి పోలీస్ ఆఫీసర్ ఇంట్లో దొంగలు పడ్డారు, దొంగల అలికిడికి పోలీస్ ఆఫీసర్ బార్య నిద్రలేచి...గాఢంగా నిద్రపోతున్న తన భర్తతో.......ఏమండీ మన ఇంట్లో దొంగలు పడ్డారు, త్వరగా లేవండి అంది... వెంటనే భర్త ... ఇప్పుడు నేను డ్యూటీలో లేను, నన్ను విసిగించకు అన్నాడు.

ఇలాంటి వ్యక్తులు నిజ జీవితంలో ఉంటారా అంటే... కొద్దిమంది వారి జీవితం లోని కొన్ని ముఖ్య విషయాలలో కూడా బాద్యత తీసుకోకుండా, ఇలాగె ప్రవర్తిసారని చెప్పవచ్చు. మన పనికి మనం బాద్యత తీసుకోక పోతే ఎన్నో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎలా అంటే...

ఒక వడ్రంగి తన ఉద్యోగాన్ని చాల సంవత్సరాలు చేసిన తర్వాత, తన పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో తన యజమాని తన మంచి ఉద్యోగి వెళ్ళడం చూసి బాధపడుతూ, నీవు ఏమి అనుకోకుండా నాకు ఒక ఇంటిని నిర్మించగలరా అని అడిగాడు. ఆ వడ్రంగి మనస్సులో పని చెయ్యాలి అని లేకున్నా, యజమాని చెప్పాడు కాబట్టి... అవును అని చెప్పాడు, కాని కాలక్రమేణా అతని హృదయం తన పనిలో లేకుండా పోయింది. అతను పనికిరాని మరియు నాసిరకం పదార్థాలను ఆ కట్టడంలో ఉపయోగించాడు. అలా మొత్తానికి ఆ వడ్రంగి తన పనిని పూర్తి చేసాడు. ఆ ఇంటిని పరిశీలించడానికి తన యజమాని వచ్చినప్పుడు, అంతా పని అయిపొయింది అని చెప్పాడు. అప్పడు ఆ యజమాని ఆ ఇంటి తాళం చెవిని వడ్రంగికి ఇచ్చాడు. "ఇది మీ ఇల్లు," ఈ ఇల్లు మీకు నా బహుమతి అని యజమాని అన్నాడు.

ఆ మాట విన్న వడ్రంగి షాక్! అతను తన సొంత ఇంటిని నిర్మిస్తున్నట్లు మాత్రమే తెలిసి ఉంటే, అతను ఇవన్నీ చాలా భిన్నంగా చేసేవాడు. ఇప్పుడు అతను బాగా నిర్మించని, నాసిరకమైన ఇంటిలో నివసించవలసి వచ్చింది. తన బాధ్యతారహితమైన పని, తనకే నష్టం తెచ్చింది అని గుర్తించాడు.

మీరే వడ్రంగిగా ఆలోచించండి. మీ పని గురించి ఆలోచించండి. ప్రతి రోజు మీరు మీ పనిని బాధ్యతతో, తెలివిగా నిర్మించుకోండి. ఇది మీరు నిర్మించే ఏకైక జీవితం, కాబట్టి మీ జీవితానికి మీరు పూర్తి బాద్యత తీసుకోండి. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories