మన శరీరమే మన వాహనం.

మన శరీరమే మన వాహనం.
x
Highlights

ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం.... మన శరీరమే మన వాహనం. మనం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశం వెళ్ళటానికి రకరకాలా వాహనాలు వాడుతూవుంటాము. అయితే...

ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం.... మన శరీరమే మన వాహనం.

మనం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశం వెళ్ళటానికి రకరకాలా వాహనాలు వాడుతూవుంటాము. అయితే మన జీవిత అనుభూతులను అందుకునేది మాత్రం... మన శరీరం సహయంతోనే కదా. అందుకే మన శరీరము మన జీవిత కాలపు ఒక వాహనం అని అనుకోవచ్చు. అందుకే పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహా భాగ్యం అని. అయితే మీరు మీ కారును లేదా మీ మోటర్ సైకిల్ బండిని మార్చినట్టు, ఈ శరీరం అనే వాహనాన్ని మీరు మార్చుకోలేరు కదా. మీ జీవితాంతం ఈ వాహనాన్ని మీరు బాగా ఉపయోగిస్తూ, చక్కగా కాపాడుకోవాల్సిందే.

అలాగే ఈ ప్రపంచంలో మనం ఏది అనుభూతి చెందాలన్న మనకి ఉపయోగపడే ఒక మంచి వాహనం మన శరీరం. కొద్దిమంది ఆద్యాత్మిక వేత్తలు మన శరీరం వట్టి మట్టి అని అన్నా కూడా, వారి ఉద్దేశం మన స్పృహ లేదా ఎరుక వాస్తవానికి మన బౌతికతకి మించినది అని అర్ధం, కానీ ఈ బౌతిక ప్రపంచంలో మనని నిలిపేది మాత్రం ఈ శరీరమే. అందుకే ఇది ఒక మంచి వాహనము అంటాము. ఈ వాహనాన్ని బాగా చూసుకోవాల్సిన బాద్యత కూడా మనదే.

ఫెండ్స్! మన శరీరాన్ని మనం తీసుకొనే ఆహారం ఏంతో ప్రభావితం చేస్తుంది. అలాగే సరైన ఆహరం తో పాటు, అవసరమైనంత నిద్ర, విశ్రాంతి, వ్యాయామం కూడా చాల అవసరం. ముఖ్యం మన శరీరం యొక్క భంగిమలు, అంటే మనం నిలబడే విధానము, మనం కూర్చునే విధానాము కూడా మన శరీర ఆరోగ్యం మీద, అలాగే మన భావావేశాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి అని నేటి ఎన్నో పరిశోదనలు నిరూపిస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు ఎలా కూర్చుంటూన్నాము, ఎలా నిలబడుతున్నాము అనేది కూడా చూసుకోవాలి. టీవీ ముందు కూర్చొని అది చూస్తూ.. గంటలు గంటలు ఎలాంటి కదలిక లేకుంటే మాత్రం మన శరీరానికి మనమే హాని చేస్తున్నట్టు.

అలాగే మన వయసుతో పాటు మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. కానీ మనం మన శరీరం యొక్క ఆకృతిని పట్టించుకోకుండా, దానిని సరైన విధంగా ఉంచుకోకుంటే మాత్రం, ఎన్నో ఇబ్బందులకు ఇది కారణమవుతాయి. మన శరీరాకృతి గురించి, ముఖ్యంగా మనం కూర్చోవడం, పడుకోవడం, నిలబడే విధానం గురించి కూడా చాల ఎరుక కలిగి ఉండాలి. అప్పుడే మీ శరీరం మంచి కండిషన్లో వుంటుంది.

మీరు ఒక కొత్త మెర్సిడిజు కారులో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారా? లేదా ఒక పాత రిపేరింగ్ వచ్చిన కారులో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారా? అని మిమ్మల్ని అడిగితే... మీరు ఏమని సమాధానం ఇస్తారో ఆలోచించండి. ముఖ్యంగా మీరు ఈ రెండిట్లో ప్రయాణాన్ని, వాటి మద్య వ్యత్యాసాన్ని ఈజీగా గుర్తించగలుగుతారు. చాలామంది ఫిట్ గా వున్నా కొత్త కారునే కోరుకుంటారు. ఎందుకంటే ఒక పవర్ స్టీరింగ్ వున్నా కారుకి, పవర్ స్టీరింగ్ లేని కారు డ్రైవింగ్ లో ఎంత తేడా ఉంటుందో మన అందరికీ తెలుసు కదా.

వాస్తవానికి కార్ విషయంలో అయితే కావాలంటే డబ్బులు ఇస్తే కొత్త కారు వస్తుంది. కానీ మన శరీరం విషయంలో ఈ అవకాశం లేదు కాబట్టి ఎప్పుడూ సరైన విధంగా మన శరీరాన్ని మెయిన్టెయిన్ చేస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు మన జీవితాంతం మనతో ఉండాల్సింది ఈ శరీరమే కాబట్టి, మనం చాలా విషయాలు ఆచరణలో చూసుకోవాల్సి ఉంటుంది.

ఉదాహరణకి ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకు వచ్చింది అనుకుందాం, దాని ప్రకారం .... "మీకు మీ జీవితాంతం ఒకే కారు ఉంటుంది" అని వారు అంటే... మీరు ఆ కారును జాగ్రత్తగా చూసుకోరా అలాగే మన శరీరానికి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని మీరు గుర్తించాలి.

కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు.. "మీరు ఎలాంటి వెహికల్ ని వాడడానికి ఇష్టపడతారు అని అడిగితే, అలాగే మీ ఎరుకని, లేదా ప్రాణ శక్తిని ఎలాంటి వెహికల్ ద్వారా క్యారీ చేయాలనుకుంటున్నారు అని కూడా అదిగితే మీ సమాధానం ఏంటో ఆలోచించండి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే క్రమంలో, చాలా మందికి అసలు విషయం అర్థమవుతుంది కదా!

సో! మీరు హై పర్ఫామెన్స్ ఉన్న స్పోర్ట్స్ కారు వాడతారా లేదా మామూలు పాత కార్ వాడతారా అని ఆలోచించండి, అంటే సమాధానం చాలా సులువు అవుతుంది. మనం గుర్తుంచుకోవాల్సింది మన శరీరం కూడా ఒక వాహనం లాంటిది అని. ఈ వాహనాన్ని రిపేర్ చేసుకోవచ్చు కానీ పూర్తిగా కొత్తది కొనుక్కొని తీసుకువెళ్లేలేము. ఈ వాహనము ప్రపంచాన్ని అనుభవించే, అనుభూతి చెందే అవకాశము మనకి కల్పిస్తుంది. కాబట్టి మీ ఈ వాహనం అనే శరీరాన్ని సరైన విధంగా నిర్వహించాలని మీరు నిర్ణయించుకోండి.

అలా నిర్వహించడానికి ముఖ్యంగా మీ ఆహార అలవాట్లను పరిశీలించి, అవసరమైన విధంగా మార్చుకోండి. ఇంకా అవసరమైనంత విశ్రాంతి, శారీరక వ్యాయామం చాల అవసరం. చాలామందికి కండలు తిరిగిన శరీరం పొందాలని వుంటుంది, దాని కోసం జిమ్ లో గంటలు గంటలు కష్టపడతారు కూడా. అయితే ఒక జిమ్ కోచ్ "ఆరోగ్యకరమైన కండలు జిమ్ లో కాదు, వంట గదిలో తయారుఅవుతాయి"అంటాడు. కాబట్టి మీ శరీర ఆరోగ్య విషయంలో ఆహారం గురించి చాల శ్రద్ద తీసుకోండి. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories