ధనమనే ఇంధనానికి దారి తెలుసుకోండి

ధనమనే ఇంధనానికి దారి తెలుసుకోండి
x
Highlights

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం.... ధనమనే ఇంధనానికి దారి తెలుసుకోండిధనమనే ఇంధనానికి దారి తెలుసుకోండి. ఫ్రండ్స్! మీరు "ధనం మూలం ఇదం జగత్" అనే...

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం.... ధనమనే ఇంధనానికి దారి తెలుసుకోండిధనమనే ఇంధనానికి దారి తెలుసుకోండి.

ఫ్రండ్స్! మీరు "ధనం మూలం ఇదం జగత్" అనే మాట విన్నారా?

డబ్బు యొక్క పాత్ర ఈ సమాజంలో ఎంత వుందో ఈ ఒక్క మాటే చెపుతుంది. మన ప్రస్తుత సమాజంలో ధనం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు వుండటం వలన ఎలాంటి సౌకర్యాలు, సుఖాలు, అవకాశాలు, ఆనందాలు వస్తాయో మీకు తెలుసు. అయితే ఈ ధనన్నే కొద్దిమంది డబ్బులు అని, కొద్దిమంది పైసలు అని, కొద్దిమంది రొక్కం అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఈ డబ్బు యొక్క అవసరాన్ని గుర్తించనివారు, దీని అవసరాన్ని తెలియని వారు చాలా తక్కువగా ఉంటారు.

అయితే చాలామందికి ఈ డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది, కానీ ఈ డబ్బు యొక్క కొన్ని మూల సూత్రాలు, ఆ డబ్బు తత్వం, డబ్బు లక్షణం తెలుసుకోకుండానే డబ్బులు సంపాదించాలని కృషి చేస్తూ ఉంటారు. డబ్బు కోసం రకరకాల పనులు చేస్తూవుంటారు, రకరకాల వేషాలు వేస్తువుంటారు.. మాటలు మారుస్తూ వుంటారు. అలాగే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశ పడుతుంటారు. అందుకోసం రకరకాల దొడ్డి దారులు వెతుకుతూ వుంటారు.

ఈ డబ్బులు సంపాదించడానికి కొద్ది మంది వారి నైపుణ్యాలను వాడుకుంటారు, కొంతమంది వారి మేధోసంపత్తిని వాడుకుంటారు, కొద్ది మంది ఇతరుల యొక్క నమ్మకాన్ని వాడుకుంటే, మరి కొద్దిమంది మాత్రం వారి యొక్క సేవలను అందిస్తూ, లేదా ఇతరులకు వారి వద్ద వున్న వస్తువులను అందిస్తు, రకరకాల వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదించడానికి ఎంతోమంది కృషి చేస్తూ ఉంటారు. అయితే డబ్బు గురించి తెలుసుకోవడంలో అత్యంత ముఖ్యమైన విషయం, అది ఎక్కడ ఎవరికి ఉచితంగా రాదు అని, అందుకే ఒక వ్యాపార ప్రకటనలలో అంటారు కదా! డబ్బులెవరికి ఊరికే రావు అని.

మరి డబ్బు ఏం చేస్తే వస్తుంది అని ఆలోచిస్తే, మనం కోరుకునే డబ్బుకి సరిపడా లేదా అంతకన్నా ఎక్కువ విలువని ఇతరులకు ఎవరైతే అందిస్తారో, వారి వద్దకు డబ్బు వస్తుంది. ఆ విలువ రూపంలో ఇచ్చేది మనం అందించే సేవ అయి ఉండవచ్చు లేదా మనం తయారు చేసిన ఒక వస్తువు అయిఉండవచ్చు లేదా మన నైపుణ్యాన్ని మనకు తెలియని మరో వ్యక్తికి ఉపయోగ పడేలా వాడటం అయ్యుండొచ్చు. కాబట్టి ఇప్పుడు డబ్బుకి సంబంధిచిన కొన్ని మూల సూత్రాలు తెలుసుకొందాము. ఈ మూల సూత్రాలు మీకు సులభంగా అర్ధం కావలి అంటే అసలు డబ్బు వున్నవారు ఆ డబ్బు విషయంలో ఏమి చేస్తుంటారో మీకు తెలియాలి. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.

డబ్బు ఉన్న వారు, ఆ డబ్బుని మరింత డబ్బు సంపాదించడానికి వాడుకుంటారు: డబ్బున్న వారు ఆ డబ్బుతో మరింత డబ్బు సంపాదించడానికి తమ వద్ద వున్న డబ్బుని పెట్టుబడిగా వాడుకుంటారు. కాని డబ్బు లేని వారిని మీరు చూస్తే, వారి యొక్క కనీస అవసరాలు తీర్చుకోవడం లోనే, వారి దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. వారికు కూడా పొదుపు చేయాలన్న కోరిక, ఆలోచన వున్నా కూడా, కొంత డబ్బు పొదుపు చేయగానే, మరో అత్యవసరం వచ్చి, ఆ పొదుపు చేసిన డబ్బుని ఖర్చు చేసేస్తారు. కానీ ధనవంతులు కావాలని కోరుకునే వారు, వారు సంపాదించిన డబ్బులలో కొంత డబ్బుని , కొంత భాగాన్ని పొదుపు చేయడమే కాకుండా దానిని పెట్టుబడిగా పెడతారు. అయితే అలా డబ్బును సరైన విధంగా పెట్టుబడిగా పెట్టడం వలన ఆ డబ్బు మరింత పెరగడానికి సహాయపడుతుంది.

డబ్బున్న వారు ఇతరుల సలహాలను పరిశీలిస్తారు: డబ్బున్న వారు, వారి డబ్బుని పెంచుకునే క్రమంలో దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని అన్ని పద్ధతుల్లో సంపాదించడానికి, ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా ఎవరైనా వారికి, ఎలాంటి సలహా ఇచ్చినా కూడా, వాటిని విని, వాటిని పరిశీలించి, ఆ సలహాలు వారి వ్యాపార అభివృద్దికి ఉపయోగపడతాయని వారు భావిస్తే, ఆ సలహాని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే వారు ఒక నిరంతర విద్యార్థిగా డబ్బు గురించి తెలుసుకుంటూ, పరిశీలిస్తుంటారు.

డబ్బున్న వారు సమస్యలను అవకాశాలుగా చూస్తారు: వారు తమ చుట్టూ చూసే సమస్యలని సమస్యల్లా కాకుండా, అందులో వారికీ ఉన్న అవకాశాలని అందుకోవడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా సమాజంలో ఉన్న రకరకాల సమస్యలకు తమ వస్తువుల ద్వారా లేదా తమ సేవల ద్వారా ఎలాంటి పరిష్కారం ఇవ్వగలమా అని ఆలోచిస్తుంటారు. ఇలా సమస్యలను తగ్గించడం ద్వారా లేదా ఇతరుల యొక్క సౌకర్యాలు పెంచడం ద్వారా, వారు తమ సంపాదనను పెంచుకుంటారు. ఆర్ధికంగా లాభం పొందుతారు.

డబ్బున్నవారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు: ముఖ్యంగా వీరు ప్రస్తుతం ఉన్న సమస్యల గురించే కాకుండా భవిష్యత్తులో రాబోయే రకరకాల సమస్యల గురించి అంచనా వేయగలుగుతారు, అలాగే వాటికి పరిష్కార మార్గాలు కూడా ఆలోచిస్తువుంటారు. వారి ఆలోచనలు ప్రస్తుత స్థితి గురించి మాత్రమే కాకుండా, రాబోవు ఐదు నుంచి పది సంవత్సరాలు ఇప్పటి సమాజంలో, మనుషుల అవసరాలలో, పరిసరాలలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం వుందో తెలుసుకుంటూ ఉంటారు. అలా రాబోవు మార్పులకు అనుగుణంగా ఆలోచించి భవిష్యత్తులో వారి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు.

ఇలా ఇప్పటివరకు మనం చర్చించిన విషయాలు, వారు ఆచరించడం ద్వార డబ్బుని సరైన విధంగా పెంచుకోగలుగుతున్నారు. మీరు కూడా ఈ విషయాలను ఆచరణలో పెట్టడం ద్వార అవే లాభాలు పొందవచ్చు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories