మీకు ముఖ్యమైన పనులను ముందుగా చేయడం ఎలా?

మీకు ముఖ్యమైన పనులను ముందుగా చేయడం ఎలా?
x
Highlights

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... మీకు ముఖ్యమైన పనులను ముందుగా చేయడం ఎలా? ఫ్రెండ్స్! ప్రతి వ్యక్తికి తన జీవితంలో కొన్ని విజయాలు...

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... మీకు ముఖ్యమైన పనులను ముందుగా చేయడం ఎలా?

ఫ్రెండ్స్! ప్రతి వ్యక్తికి తన జీవితంలో కొన్ని విజయాలు సాధించాలని కోరిక వుంటుంది, అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక వుంటుంది, అలాగే తనకి కావలసినంత డబ్బు సంపాదించాలనే కోరిక కూడా ఉంటుది. కానీ కోరికలు ఉన్నంత మాత్రాన ఆ కోరికలు తీరవు కదా! మనమే మన కోరికలని, ఒక లక్ష్యంగా మార్చుకొని వాటి కోసం రోజు కృషి చేస్తూ, వాటిని సాధించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇలా కోర్కలను సాధించి విజేతలుగా నిలుస్తున్న వారు మాత్రం చాల తక్కువే, దాదాపు 10% మాత్రమే తమ కోర్కెలను సాదించి విజేతలు గా నిలుస్తున్నారట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే...తమ లక్ష్య సాధనకై చెయ్యల్సిన్న ముఖ్యమైన పనులను, వారు చేయాలేకపోవటం అనేది ముఖ్య కారణం అని ఎన్నో సర్వేలలో తేలింది. మన ప్రాధాన్యతలే మన విజయానికి ప్రాణం పోస్తాయి అని గుర్తించాలి.

కాబట్టి మన కోరికలు ఎవైన కానివ్వండి. ఆ కోరికలు తీర్చుకొని విజయానికి పొందటానికి, ముఖ్యమైన పనులన్ని మనం తప్పక చెయ్యాల్సివుంటుంది. అందుకోసం మన ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడమే అతి ప్రధానమైన అంశము. మనం రోజుకి ఎన్ని పనులు చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, మన లక్ష్యాలకు ముఖ్యమైన పనిచేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. మనం పని కోసం పని చెయ్యడం కాదు కదా! ఒక పర్పస్ కోసం పని చెయ్యాలి కాబట్టి, మన ఉద్దేశం నెరవేరే పనులే మనకి ముఖ్యమైన పనులు.

మనం ఎంత వేగంగా ఒక పని చేస్తున్నాము అనేదానికన్నా, ఆ పనులు అసలు ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకోవడమే అత్యంత ముఖ్యం! అప్పటికప్పుడు ఏ పని చేయలనిపిస్తే... అప్పటి మూడ్ ని బట్టి, ఆ పని చేసుకుంటూ పోతే, జీవితంలో ఏ గొప్ప విజయాలు మనం సాధించలేము. మన మూడ్ ప్రకారమే పని చేస్తూ ఉంటే, ఎడారిలో దారితప్పిన ప్రయాణికుడిలా కష్టపడుతూనే వుంటాము, అందుకే మన లక్ష్యానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడం చాలా ముఖ్యం. మన జీవితంలో సంతోషాన్ని పెంచే, మన జీవితం యొక్క విలువను పెంచే పనులను ముఖ్యమైన పనులుగా గుర్తించాలి. ఒక చెట్టు ఎదగడానికి సూర్యరశ్మి, నీరు, గాలి లాంటివి ఎంత అవసరమో..మన కోరిక అనే ఫలం పొందటానికి మన రోజు వారి పని అంతే ముఖ్యం.

మన ముఖ్యమైన పనులను గుర్తించడానికి, మన భౌతిక అవసరాలు అయినా, మన ఆహారం, బట్టలు, నివాసం...లాంటి అంశాలలో ముఖ్యం ఏంటో ముందుగా చూసుకోవాలి. ఆ తర్వాత మన కుటుంభ సభ్యుల, మరియు ఇతర బంధాల పట్ల మన బాద్యతలను నిలబెట్టుకోడానికి, వారికీ అవసరమైన అన్నివిషయాలు మనకి ముఖ్యమైనవిగా గుర్తించాలి. అలాగే మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, ఎదగడం, ఇతరులకి సహాయపడటం, ఇవన్ని కూడా మన జీవితములో ఒక బాగం కాబట్ట్టి, వీటికి అనుగుణంగా మన అవసరాలు గుర్తించాలి, ఇవన్నీ మన సంతోషాన్ని, మన జీవితం యొక్క విలువను పెంచేవే కాబట్టి, వీటి నుండి ముఖ్యమైన పనులను ఏంటో గుర్తించాలి.

ఇలా మన ప్రాముఖ్యతలను, మన ముఖ్య పనులను గుర్తించడానికి కొంత సమయం తీసుకుని, ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చుని, గతంలో మీరు చేసిన పనులు, ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలని ఇచ్చాయో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటివరకు మనం చేసిన పనులే మన ప్రాధాన్యతలను వ్యక్తం చేస్థాయి. అందువలన.. ఆ పనులన్నీ ఇప్పటి మీ ప్రాముఖ్యతలకి అనుగుణంగా ఉన్న పనులేనా, లేదా అప్పటికప్పుడు చేసారా అని ఆలోచించండి. అప్పటికప్పుడు చేసిన పని అయితే మాత్రం, ఇలాంటి స్థితి నుండి మీరు త్వరగా బయట పడాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని మన ప్రాముఖ్యతల కి అనుగుణంగా ఉంటే విజయాన్ని సాధించడం చాలా సులభం అవుతుంది. అలా కాకుండా అప్పటికప్పుడు, కళ్లముందు ఏ పని కనపడితే ఆ పని చేస్తూ పోతే, గమ్యాన్ని చేరుకొలేని పడవ వలె.. సముద్రం మధ్యలోనే ఉండిపోతాము.

కాబట్టి...భవిష్యత్తులో లో మనకు కావలసిన ఫలితాలకు అనుగుణంగానే, మనము ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం వుందో అలోచించి, వాటిని గుర్తించి, వాటిపైనే మన టైంని పెట్టుబడిగా పెట్టాలి. అలా సమయన్ని పెట్టుబడిగా పెట్టడానికి అవసరమైన నిర్ణయాలన్నీ మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇవే మనకు అతి ముఖ్యమైన పనులు అని గుర్తించాలి.

మనం ముఖ్యమైన పనులను మాత్రమే మన ముందు వేసుకోవాలి. ఒక పని అత్యవసరం కాబట్టి ఆ పని చేయవద్దు. అసలు ఆ పని మీకు ముఖ్యమైన పని అవునా, కాదా అని ఆలోచించిన తర్వాతే ఆ పని చెయ్యాలి. అయితే మీకు ముఖ్యమైన పనులను నిర్ణయించుకోవడానికి, మూడు విషయాలు చాల ముఖ్యం. ఒకటి మీకు వున్నా టాలెంట్స్, రెండు... మీకు ఉన్న బాధ్యతలు. మూడు మీ కోరికలు, ఈ మూడు విషయాలు కూడా పరిశీలించిన తర్వాతే మీ ప్రాధాన్యతలు ఏంటో నిర్ణయించుకోవాలి. ఈ మూడింటికి అనుగుణంగానే ఒక లక్ష్యాన్ని నిర్మించుకొని, దానికి ముఖ్యమైన పనులను మాత్రమే, మన ముఖ్యమైన పనులుగా మనం ఎంచుకోవాలి. అలాగే మీ బాద్యతల విషయంలో, ఎదుటి వారికీ ఎ విషయాలు ముఖ్యమో, అడిగి తెలుసుకోవడం వలన కూడా మీకు చాల స్పష్టత వస్తుంది, మీ బంధాలు బలపడతాయి.

అలాగే ఇప్పటి నుండి మీరు ఎ పని చేసేముందు అయిన.... మనం ఒక చౌరస్తాలో చూసే ట్రాఫిక్ లైట్స్ని గుర్తుకి తెచ్చుకోవాలి. ముందుగా రెడ్ లైట్ని గుర్తుకు తెచ్చుకోని, ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి... "అసలు ఈ పని నాకు ముఖ్యమైనదా"? అని ప్రశ్నించుకోవాలి. ఆన్సర్ "ఎస్" అని వస్తే...అప్పుడు ఎల్లో లైట్ ని గుర్తుకి తెచ్చుకొని.. "ఒకవేళ ఈ పని ముఖ్యమైనది అయితే, ఇది ఎలా ముఖ్యమైనది?" అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు కూడా సరైన కారణాలు ఆన్సర్గా వస్తే మాత్రం..ఇక మీకు ...గ్రీన్ లైట్ వచ్చినట్టు.. ఇక ఆ పనిలోకి దూకేయ్యాలి. ఇలా మీ ముఖ్యమైన పనులు చెయ్యడం వలన, సమాజంలోని ముఖ్యులలో మీరు ఒకరు అవుతారు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories