"ఇలాంటి ప్రశ్నలు అడిగితే, ఇక విజయం మీ వెనకే"

ఇలాంటి ప్రశ్నలు అడిగితే, ఇక విజయం మీ వెనకే
x
Highlights

ఫ్రెండ్స్! మనం ఈ రోజు చర్చించే అంశం... "ఇలాంటి ప్రశ్నలు అడిగితే, ఇక విజయం మీ వెనకే" ఒక రోజు న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని, ఎదో...

ఫ్రెండ్స్! మనం ఈ రోజు చర్చించే అంశం... "ఇలాంటి ప్రశ్నలు అడిగితే, ఇక విజయం మీ వెనకే"

ఒక రోజు న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని, ఎదో ఆలోచిస్తుండగా..అతని తలపై ఒక ఆపిల్ పండు పడింది. ఆ పరిస్థితిలో వున్నది ఒక సామాన్య వ్యక్తి అయితే మాత్రం, హాయిగా ఆ ఆపిల్ పండు తిని కూర్చునే వారు, కాని అక్కడ వున్నది న్యూటన్ కాబట్టి..అసలు ఈ ఆపిల్ క్రిందకే ఎందుకు పడింది? పైకి ఎందుకు వెళ్ళలేదు? అనే ప్రశ్నని పట్టుకొని దానితో ప్రయాణం చేసి....ప్రశ్నించి..ప్రశ్నించి ..పరిశోధించి, మన భూమి యొక్క ఆకర్షణ శక్తిని కనుగొన్నాడు. ఇలా ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, వ్యాపారస్తులు, నాయకులూ, తత్వవేత్తలు..తమ ప్రశ్నల ద్వారా ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టారు. మనం ఎన్నో రంగాలలోని విజేతలని పరిశీలిస్తే, వారి ఆలోచన విధానానికి, ఇతరుల ఆలోచన విధానానికి చాలా వ్యత్యాసం వుంటుంది.

ఫ్రండ్స్! మన ఆలోచనలు మన అభివృద్దికి ఎంతో ముఖ్యం. మన ఆలోచనల యొక్క క్వాలిటీ పెరిగితే, మన జీవితం యొక్క క్వాలిటీ కూడా పెరుగుతుంది. అసలు ఈ ఆలోచన అనే విషయాన్నీ మనం పరిశీలిస్తే, మన ఆలోచనలో కొన్ని ప్రశ్నలు కొన్ని సమాధానాలు వుంటాయి. అయితే మన మనసులోని ప్రశ్నని బట్టే, మన ఆలోచన అనే సమాధానాలు వస్తాయి, కాబట్టి మన ప్రశ్న యొక్క క్వాలిటి మారితే, ఆటోమేటిక్ గా మన ఆలోచన యొక్క క్వాలిటీ కూడా మారుతుంది. అయితే కొన్ని ప్రశ్నలు మనని ఆలోచింపచేస్తే, కొన్ని ప్రశ్నలు మనని రెచ్చగోడతాయి, కొన్ని మన నమ్మకాలని ఛాలెంజ్ చేస్తాయి, కొన్ని మనకు కనువిప్పు కలిగించవచ్చు, కొన్ని నవ్వు కూడా తెప్పించవచ్చు. మొత్తానికి ఎలాంటి ప్రశ్న అయిన కూడా, మన మనస్సు దానికి ప్రతిస్పందిస్తుంది.

ప్రశ్నల శక్తి చాల గొప్పది కాబట్టే ఎన్నో దేశాలలోని చట్ట సభల్లో, ప్రశ్నించే ప్రతిపక్షం వుంటుంది. అలా, ఎప్పుడు ప్రశ్నించకుంటే మాత్రం.. ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది. అలాగే ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్తలలో ఒకరైన సోక్రటీసు, తన తాత్విక చింతనకి వాడిన తార్కిక సాదనం...ప్రశ్ననే. అలాగే వ్యాపారంలో బాగంగా ఎలాంటి ముఖ్య నిర్ణయం తీసుకోవలన్న, ఆ వ్యాపారస్తుడు అడిగే ప్రశ్నలు ఎంతో ముఖ్యం. మన కొత్త సమస్యలకి, కొత్త పరిష్కారాలు కావాలంటే, మాత్రం మనం కొత్త ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకంటే..ప్రశ్నలు మన అంతశక్తి యొక్క అస్త్రాలు. వాటియొక్క శక్తిని వాడటం వలన, మీరు ఎలాంటి అడ్డంకులనైన, సమస్యలనైనా కూడా అధిగమించవచ్చు.

మన మానసిక కంప్యూటర్ అయిన మన బ్రెయిన్, ఎప్పుడు మనకి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు దానిని ఎలాంటి ప్రశ్నఅడిగిన అది సమాధానం ఇస్తుంది. ఇది ఒక అమెజాన్ "అలెక్షా"లా, గూగుల్ అసిస్టెంట్ లా రకరకాల సమాధానాలు మనకి ఇస్తుంది. కానీ మీరు మీ బ్రెయిన్కి చెత్త ప్రశ్న వేస్తే మాత్రం, అది చెత్త సమాధానం ఇస్తుంది. "నేను ఎందుకు ప్రతి సారి కోపం తెచ్చుకుంటాను?"...అని అడిగితే...మీ మనసు, మీకు కోపం ఎక్కువ కాబట్టి, బీ.పి వుంది కాబట్టి, మీ ఫ్యామిలీ లో అందరు అలాగే కాబట్టి..అని సమాదానం ఇస్తుంది. అదే మీరు, ఉపయోగకరమైన ప్రశ్న వేస్తే ఉపయోగపడే పరిష్కారం ఇస్తుంది. ఇప్పుడు మీరు "నేను అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటానికి ఏమి చెయ్యాలి?" అని మీ మనసుని అడిగారనుకొందాం..అప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ఎన్నో మార్గాలు చూపెడుతుంది.

మన ప్రశ్నలు మన ఫోకస్ని కూడా మారుస్తాయి, అలాగే మన ఫీలింగ్స్ని కూడా మారుస్తాయి. ఉదాహరణకి...మీరు మిమ్మల్ని..ఈ ప్రశ్న అడిగిచూడండి..... " నేను ప్రస్తుతం నా జీవితంలో, ఎ విషయంలో చాల తృప్తిగా వున్నాను" అని.....అలా అడిగిన తర్వాత, మీ మనసు...మీ దృష్టిని మీరు తృప్తిగా వున్నా విషయాలపైనే మళ్ళిస్తుంది. అయితే ప్రశ్నలు ఎక్కువగా ఎవరు వాడుతారని మనం ఆలోచిస్తే, ఎక్కువగా అడిగేది, వాడేది పిల్లలే కదా.

ప్రశ్నల విషయంలో చిన్నపిల్లలు, వారి సహజమైన కుతూహలం వల్ల ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. అందుకే కుతూహలం మహాబలం అంటారు. మనిషికి కుతూహలమే జీవితం మీద ఆసక్తిని పెంచుతుంది. అలా కుతూహలంతో అడిగే ప్రశ్న, నిశ్చలమైన నీటిలో ఒక రాయి వేస్తే, ఎలా ప్రకంపనలు వస్తాయో, అలా మన మనస్సులో ఎన్నో ప్రకంపనలు సృష్టింస్తుంది. ఇలా మన పరిమితులను పశ్నించడం ద్వార మన పరిది పెరిగి, మన ప్రగతి సాద్యం అవుతుంది. కాబట్టి మానవ ప్రగతికి ప్రశ్నే మొదటి సాదనం.

ఉదాహరణకి...మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రశాంతంగా ఒక దగ్గర కూచొని, ఏడూ దీర్ఘశ్వాసలు తీసుకొని "ఈ సమస్య యొక్క గొప్పతనం ఏమిటి?" అని మూడు నుండి నాలుగు సార్లు, మిమ్మల్ని మీరు, అదే ప్రశ్నని మల్లి, మల్లి అడిగి చూడండి. అప్పుడు మెల్లిగా మీ మనస్సు లోతులోనుండి వచ్చే సమాధానం వినండి. అలాగే మీరు ఇప్పుడు వున్న పరిస్థితి మీకు నచ్చకుంటే, "ఇప్పుడు వున్నఈ పరిస్థితిని నాకు కావాల్సిన విధంగా ఎలా మలచుకోగలను?"అని మూడు నుండి నాలుగు సార్లు, మిమ్మల్ని మీరు, అదే ప్రశ్నని మల్లి, మల్లి అడిగి చూడండి. లేదా "ఈ అనుభవం నా నైపుణ్యాన్ని ఎలా పెంచుతుంది?" అని ప్రశాంత స్థితిలో మల్లి, మల్లి అడగండి, ఫలితాన్ని చూడండి. ఇలా మీరు ఈ ప్రశ్నలపై మీ దృష్టిని ఎప్పుడైతే పెడతారో మీ మనస్సు లోపలి నుండి అద్బుతమైన పరిష్కారాలు వస్తాయి. ఫ్రండ్స్ ఇప్పటివరకు మన ప్రశ్నలు, మనకు ఎలా సహాయపడతాయో తెలుసుకున్నాం కదా.

ఫ్రండ్స్... ఇక మీరు ఎలాంటి ప్రశ్నలు మిమ్మల్ని, ఇతరులను మీరు అడుగుతారో ఆలోచించండి. ముఖ్యంగా ఏమిటి, ఎందుకు, ఎలా, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ అని చిన్న చిన్న ప్రశ్నలు, మిమ్మల్ని ఉత్సాహపరిచే ప్రశ్నలు తాయారు చేసుకోండి. ఇలా చేస్తే ఆకాశంలో దుసుకేల్లె మిసైల్లా, మన ప్రశ్నలు మన మనస్సులోకి దూసుకెళ్ళి తమ లక్షాన్ని చేరగలవు. కాబట్టి మన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలలో, మన ప్రశ్నలను సరిచూసుకోని, ప్రశ్నిస్తే అప్పుడు మన విజయం, మన వేనేకే, మన నీడలా వస్తూనే వుంటుంది. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories