ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నన్ను దీనంగా చూస్తున్నాయి, "నేనెప్పుడు చూడని ఈ కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి" నేనెవర్ని? అని బాహుబలి సినిమాలో...
ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నన్ను దీనంగా చూస్తున్నాయి, "నేనెప్పుడు చూడని ఈ కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి" నేనెవర్ని? అని బాహుబలి సినిమాలో ప్రభాస్ యొక్క డైలాగ్ చాల ఫేమస్ అయ్యింది కదా! ఫ్రండ్స్ అలా ఇతరుల కళ్ళలోకి చూసి వారి భావాన్ని అర్ధం చేసుకోడం ఒక గొప్ప కళ. అందుకే ఈ రోజు మనం చర్చించే అంశం...
"కన్నుల బాషతో, కన్విన్సు చెయ్యండి ఇలా"
కళ్ళు అనేవి మన ఆత్మకు కిటికీలు లాంటివి అని అంటారు. మనం నోటితో చెప్పని ఎన్నో విషయాలు కూడా మన కళ్ళు చెప్పెస్తుంటాయి. మన నవ్వు నిజాయితిని, మన మాట నిజాయితిని సర్టిఫై చేసేది కూడా మన కనులే. బహుశ అందువలననే ఏమో, మనకు నచ్చినవారు కొద్ది సేపు మన కళ్ళలోకి సూటిగా చూస్తే చాలు, మన గుండె కొట్టుకునే వేగం మారుతుంది. అలాగే వ్యక్తుల మద్య ప్రేమలో కూడ వారి కళ్ళు అనేవి చాలా ప్రత్యెక పాత్రని పోషిస్తాయి. మన ప్రేమ మన కళ్ళల్లో కనపడుతుంది అంటారు. మనకు నచ్చిన వ్యక్తి కనపడగానే మన కళ్ళు పువ్వుల్లా విచ్చుకుంటాయటా. మన కళ్ళు నక్షత్రాల్లా మెరిసిపోతాయటా. అందుకేనేమో కొందరూ ప్రేమికులు కళ్ళలోకి కళ్ళుపెట్టి ఎంతో సేపు..అలా చూస్తూనే, తమ చుట్టూ వున్నా ప్రపంచాన్ని మరచిపోతారు. అలాంటి వారిని మనం గమనిస్తే, కళ్ళు అనేవి మన ప్రేమలో, మన సంభాషణలో, మన భావ వ్యక్తీకరణలో ఎంతో ముఖ్యమైనవని మనకి అర్ధం అవుతుంది.
కాని అందరికి ఈ కన్నుల భాష పూర్తిగా అర్ధం కాకపోవచ్చు...అందుకే 7/G బృందావన్ కాలని అనే సినిమాలో హీరో ఒక పాట పాడినట్టు.... "కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే...........ఒకవైపు చూపి మరువైపు దాచగ, అద్దాల మనసు కాదులే" అని అనుకుంటుంటారు. అయితే ఫ్రెండ్స్ మనం మాత్రం, NLP అనే సబ్జెక్టు లోని "ఐ ఆక్ససింగ్" అనే విషయం తెలుసుకుంటే, ఈ కన్నుల బాషని ఈజీగా పట్టేయవచ్చు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి నోటితో అబద్దం చెప్పిన కూడా, అతని కళ్ళు నిజమే చేపుతాయని అంటారు. మరి అప్పుడు నిజం ఏంటో ఎలా గుర్తించాలో, ఆ కల్ల బాషని పట్టేది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఎవరైనా సరే వారి కన్నుల కదలికలను దాచిపెట్టలేరు, కాబట్టి ఎదుటి వారి కన్నుల కదలికలను మనం ముందుగా పరిశీలించాలి. వాటిని పరిశీలించి మీరు దాని అర్ధాన్ని చదవగలిగితే, వారి మనసులో ఏమి జరుగుతుందో, వారు ఎ విధంగా ఆలోచిస్తున్నారో, ఎలా చెపితే వారు త్వరగా కన్విన్సు అవుతారో మీరు తెలుసుకోవచ్చు. దీని ద్వార ఎదుటివారు మనతో సంబాషణ చేసేప్పుడు, ముఖ్యంగా వారి పంచేంద్రియాలలో ఏ సెన్స్ ని ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకోవచ్చు, ఆ సెన్స్ లేదా ఆ ఇంద్రియం సంబదించిన విధానంలో మనం మాట్లాడటం వలన ఎదుటివారికి ఈజీగా అర్ధం చేయించవచ్చు.
కొద్ది మంది ఒక కొత్త విషయాన్నీ గురించి చూడటం అనే సెన్స్ ద్వార ఈజీగా నేర్చుకుంటారు, దీనినే మనం NLP లో విసువల్ అని అంటాము, మరి కొద్దిమంది వినటం ద్వార అంటే లేదా ఆడిటరి ద్వార్త ఒక కొత్త విషయాన్నీ గురించి ఈజీగా నేర్చుకుంటారు, మరి కొద్ది మంది ఆ పనిని చెయ్యటం ద్వార ఈజీగా నేర్చుకుంటారు. దీనినే కినెస్థెటిక్ అని NLP లో అంటారు. మనం ఎదైన ప్రశ్నని ఎదుటివారిని అడిగినప్పుడు, వారి కళ్ళ కదలికని బట్టి వారు ఎ సెన్స్ వాడుతున్నారో, మనము ఆ సెన్సు లోనే మాటలాడటం ద్వార ఎదుటి వ్యక్తిని కన్విన్సు చెయ్యగలము. ఒక సంభాషణలో ఎదుటి వ్యక్తి కళ్ళ కదలికలు చాలావరకు ఆరు రకాలుగా వుండే అవకాశం వుంది.
మొదటిది. వారి కళ్ళు పై భాగంలోకి వెళ్లి, కుడి వైపు వెళితే, వారి మనసులో ఏదో ఉహ చిత్రం చూస్తున్నారని అర్ధం. ఉదాహరణకి మీరు బ్లూ కలర్ డ్రెస్ లో ఎలా వుంటారు అని అడిగారనుకోండి...వారి కళ్ళు అలా కుడి వైపు పైకి వెలుతాయి.
రెండవది. వారి కళ్ళు పై భాగంలోకి వెళ్లి, ఎడమ వైపు వెళితే, వారి మనసులో ఏదో గత జ్ఞాపకం యొక్క చిత్రం చూస్తున్నారని అర్ధం. ఉదాహరణకి మీరు మీ చిన్నప్పటి స్కూల్ బిల్డింగ్ ఎ కలర్ లో వుంది అని అడిగారనుకోండి...వారి కళ్ళు అలా ఎడమ వైపు పైకి వెలుతాయి.
మూడవది. వారి కళ్ళు మద్య భాగంలోకి వెళ్లి, కుడి వైపు వెళితే, వారి మనసులో ఏదో ఉహ శబ్దాన్ని వింటున్నారని అర్ధం. ఉదాహరణకి మీరు ఓక కోకిల హ్యాపీ బర్త్ డే పాట పాడితే ఎలా వినిపిస్తుంది అని అడిగారనుకోండి...వారి కళ్ళు అలా కుడి వైపు మధ్యకి వెలుతాయి.
నాలుగవది. వారి కళ్ళు మద్య భాగంలోకి వెళ్లి, ఎడమ వైపు వెళితే, వారి మనసులో ఏదో గత జ్ఞాపకం యొక్క శబ్దాన్ని వింటున్నారని అర్ధం. ఉదాహరణకి మీరు ఎదుటి వ్యక్తిని, మీ అమ్మగారు మీమ్మల్ని పిలిచినప్పుడు ఆవిడా వాయిస్ ఎలా వుంటుంది అని అడిగారనుకోండి...వారి కళ్ళు అలా ఎడమ వైపు మధ్యకి కి వెలుతాయి.
ఐదవది. వారి కళ్ళు క్రింది భాగంలోకి వెళ్లి, కుడి వైపు వెళితే, వారి మనసులో ఏదో ఫీలింగ్ లో వున్నారని అర్ధం. ఉదాహరణకి మీరు ఒక ఐస్ ముక్కని పట్టుకుంటే ఎలా ఫీల్ అవుతారు అని అడిగారనుకొండి... వారి కళ్ళు అలా క్రింది భాగంలోకి కుడి వైపు క్రిందకి వెలుతాయి.
ఆరవది. వారి కళ్ళు క్రింది భాగంలోకి వెళ్లి ఎడమ వైపు వెళితే, వారి మనసులో వారె ఏదో మాట్లాడుకుంటున్నారని అర్ధం. ఉదాహరణకి వారి మాసులో ఒక జోక్ చెప్పుకోనమనండి..వారి కళ్ళు అలా ఎడమ వైపు క్రిందకి వెలుతాయి.
ఈ ఆరు విషయాలు తెలుసుకోవడం వలన మీరు ఎదుటి వ్యక్తిని ఎలా కన్విన్సు చెయ్యగలము అనే అనుమానం మీకు ఇప్పుడు రావచ్చు. మీరు ఎలా కన్విన్సు చెయ్యవచ్చో ఒక ఉదాహరణ ద్వార చూద్దాం. మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వుండి, ప్లాట్స్, హౌస్లు అమ్ముతున్నారు అనుకుంటే.. మీరు ఒక కొత్త వ్యక్తిని కలిసి మీరు అమ్మే ప్లాట్ గురించి వివరిస్తున్నారు అనుకుందాము. మీరు వారిని ఎవైన కుశల ప్రశ్నలు వేస్తున్నప్పుడు, వారి కన్నులు కదలిక ఎటు వైపు వెళ్తుందో గమనించండి. ముఖ్యంగా వారి కళ్ళలోని బ్లాకు ఐబాల్, వారు మాట్లాడుతున్నప్పుడు అది పై వైపు వెళితే..వారు చూడటం ద్వార కన్విన్సు అయ్యేవారని అర్ధం. అంటే అప్పుడు మీరు వారికీ మీ దగ్గర వున్నా రంగురంగుల బ్రోచర్ చూపించండి. ఒక వేళా వారి కనులు మద్య వైపు వెళితే మీ మాటలతోనే ఎక్కువగా వర్ణించండి, లేదా ఇతర్లు ఆ ప్లాట్ గురించే ఏమంటున్నారో చెప్పండి. వారు మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళు క్రిందకి వెళితే, ముఖ్యంగా కుడి వైపు క్రిందకి వెళితే... ఆ ప్లాట్ వారు కొన్న తర్వాత ఎలా గొప్పగా, తృప్తిగా ఫీల్ అవుతారో వివరించండి. ఇలా ఎదుటి వ్యక్తి ఎ సెన్స్లో అలోచిస్తున్నాడో తెలుసుకొని అలా మాట్లాడటం వలన చాల సులభంగా కన్విన్సు చెయ్యవచ్చు. అల్ ది బెస్ట్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire