"నెగటివ్ ఆలోచనలని దూరంగా ఉంచండి ఇలా!

నెగటివ్ ఆలోచనలని దూరంగా ఉంచండి ఇలా!
x
Highlights

ఫ్రెండ్స్ ! మనం ఈ రోజు చర్చించే అంశం..... "నెగటివ్ ఆలోచనలని దూరంగా ఉంచండి ఇలా! మన లక్ష్యానికి కావాల్సిన పని చేయకుండా ఆపే మొదటి శత్రువు...

ఫ్రెండ్స్ ! మనం ఈ రోజు చర్చించే అంశం..... "నెగటివ్ ఆలోచనలని దూరంగా ఉంచండి ఇలా!

మన లక్ష్యానికి కావాల్సిన పని చేయకుండా ఆపే మొదటి శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది మన నెగిటివ్ థింకింగ్. ఇది మన ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని తగ్గించి ఒక నిర్ణయం తీసుకోలేకపోయేలా చేస్తుంది, దీని వల్ల మనం ప్రతి పనిని వాయిదా వేసి బద్దకస్తులుగా మారిపోతాము.

ముఖ్యంగా కొన్ని ఆలోచనలైన ... "ఇది జరగదేమో" "నాకెప్పుడు దురదృష్టమే ఏదో ఒకటి అడ్డు పడుతుంది" అని ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం మనకు ఉండదు.

ఈ ప్రపంచంలో మనం పూర్తిగా ప్రోఆక్టివ్గా ముందుకు వెళ్లకుండా ఎన్నో నెగిటివ్ మెసేజ్,లు ఎన్నో అనవసర మెసేజ్లు మనకు వినపడుతుంటాయి, కనపడుతుంటాయి. అయితే ఇలాంటి మెసేజ్లు ప్రభావానికి గురికాకుండా, నెగటివ్గా ఆలోచించకుండా మనం పాజిటివ్గా ఆలోచించడం మన విజయానికి చాలా ముఖ్యం.

నెగిటివ్ థింకింగ్కి ఉన్న ఇబ్బంది ఏమిటంటే అలా చేస్తున్నప్పుడు, అంటే మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు మనకి అలా చేస్తున్నామని కూడా తెలియదు. అందుకే మన ఆలోచనల యొక్క అర్థాన్ని, అంతరార్ధాన్ని గ్రహిస్తువుండాలి. ముఖ్యంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి పదాలు వాడుతున్నామని ఆలోచించడం వల్ల కూడా మన ఆలోచన సరళి గురించి తెలుసుకోవచ్చు.

మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు లేదా మాట్లాడుతున్నారు అని గుర్తించగానే వెంబడే ఆ ఆలోచన ఆపేసి, అదే స్థానంలో పాజిటివ్గా ఆశావాద దృక్పథంతో ఉన్న ఆలోచనలని ఉపయోగించండి. ఇది ఒక ఆటలా ముందుగా మొదలు పెట్టాలి. మనం చెబుతున్న లేదా ఆలోచిస్తున్న విష్యం భయం వల్ల కాకుండా సత్యం ఆధారంగా వుందని గుర్తించడం చాలా ముఖ్యం.

ఒకటి గుర్తుపెట్టుకోండి గతంలో నెగిటివ్గా ఆలోచించారు కాబట్టి, ఇప్పుడు కూడా ఆలోచిస్తారని, ఆలోచించాలని ఏమీ లేదు. ఎ వ్యక్తి అయిన తన ఆలోచనలపై సాధనతో పట్టు సాధించవచ్చు. మన భవిష్యత్తు నిర్దేశకులము మనమే అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనం తీసుకుంటున్న చర్య యొక్క మూలం, మన భయం వల్ల ముందుకు వెళ్తున్నామా, లేదా ఆశావాద దృక్పథం వల్ల ముందుకు వెళ్తున్నమా చూసుకోవాలి.

మన అంతచేతనంగా, మన నెగటివ్ థింకింగ్ మనకి ఒక రక్షణ యంత్రంలా పనిచేస్తుంది. చెడు వల్ల కష్టాల వల్ల మనకి కష్టం ఇబ్బంది జరగవద్దని అది పనిచేస్తుంది. ఇది ఒక రక్షణ కవచం లాంటిది. అయితే ఇలా ఆలోచించడం వల్ల ఎక్కువ నష్టమే వస్తుంది. ఎందుకంటే కీడెంచి మేలు ఎంచే క్రమంలో, ఎప్పుడైతే మనం కష్టాన్నీ నష్టాన్నీ ఉహిస్తున్నమో, ఆలోచిస్తున్నామే, తెలియకనే మనము మన భయాన్ని, అభద్రతని పెంచుకుంటున్నాము. అలాగే ఆ ఆలోచనల వల్ల ఆ కష్టాన్ని నష్టాన్ని మన మనో శక్తిని ఉపయోగించి సృష్టిన్చుకుంటున్నాము. అలాగే మన బెస్ట్ ఎఫ్ఫొర్త్స్ ని మనం ఇవ్వలేక పోతాము. ఇంకా మన యొక్క కాన్ఫిడెన్స్, నమ్మకము తగ్గిపోతాయి. అలాగే పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఫ్లో కాదు. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల అలాంటి పరిస్థితినే మనం ఆకర్షిస్తాము అని గుర్తించాలి.

కాబట్టి నెగటివ్ థింకింగ్ ఒక రకమైన సెల్ఫ్ అబ్యూస్ అవుతుంది. ఏది నష్టం కావచ్చు, ఏది కష్టం కావచ్చు అని ఆలోచించడం కొంత మంచిదే, కాని పూర్తిగా ఆ ఆలోచనతోనే లీనమైతే మాత్రం చాలా నష్టాలు వస్తాయి. కీడు ఎంచిన వెంబడే మేలు కూడా ఎంచాలి. అలాగే ఆ మేలుకు సంబంధించిన ఆలోచనలలో పూర్తిగా నిమగ్నం అవ్వాలి.

అలాగే మనం ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మన భయమైన ,నెగిటివ్ ఆలోచనలైన మానని ఎమోషనల్ గా స్ట్రాంగా చేయవు సరి కదా చాల బలహీనపరుస్తాయి. అందుకే అంతా పాజిటివ్గా అవుతుందనే ఎమోషన్ తో ఉంటే ఒకవేళ అడ్డంకులు వచ్చినా ఉత్సాహముతో వాటిని మనం ఎదుర్కోగలం.

ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆలోచనలకు సంబంధించిన పూర్తి అవేర్నెస్, మరియు అప్రమత్తతో ఉండాలి. ప్రతికూల ఆలోచనలు వదిలి సానుకూలంగా ఆలోచిస్తూ ఉత్సాహవంతంగా ఉండాలి.

మనకు ఏం కావాలో దానిని మన మనసులో ముందు ఉంచుకోవాలి. అయితే మనం ఓడినా గెలిచినా, మన బెస్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం అని అర్ధం చేసుకోండి. అయితే పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీరు ఒక ఆట జరుగుతున్నప్పుడు అందులో ఒక ఆడియన్స్ లా ఉండకుండా మీ జీవితంలో ఒక ఆటగాడిలా ఉండాలంటే మాత్రం పాజిటీవగా ఆలోచిస్తే అన్ని సాధ్యమో. కాబట్టి ఈ రోజు నుంచి పాజిటివ్ ఆలోచనలను మీ సహచరులుగా చేసుకొని విజేతలుగా నిలవండి. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories