మీ బాడీ లాంగ్వేజ్ బద్రం బ్రదర్!

మీ బాడీ లాంగ్వేజ్ బద్రం బ్రదర్!
x
Highlights

ఫ్రండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం...మీ బాడీ లాంగ్వేజ్ బద్రం బ్రదర్! ఈ రోజుల్లో ఎ రంగంలోనైన విజయం సాదించాలి అంటే, ఒక వ్యక్తి యొక్క కమ్యూనికేషన్...

ఫ్రండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం...మీ బాడీ లాంగ్వేజ్ బద్రం బ్రదర్!

ఈ రోజుల్లో ఎ రంగంలోనైన విజయం సాదించాలి అంటే, ఒక వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చాల ముఖ్యం. మన రోజువారీ జీవితంలో బాగంగా ఇతరులతో ఎన్నో సంభాషణలు చెయ్యల్సివుంటుంది. మన సంభాషణలో బాగంగా మన మాటలు, మన వాయిస్, మన బాడీ లాంగ్వేజ్ ఎంతగానో ఉపయోగిస్తుంటాం. మన బాడీ లాంగ్వేజ్ అంటే మన చేతి కదలికలు, మన ముఖకవళికలు, మనం నిలుచునే తీరు, మన చూపు, ఇలా మన శరీరం యొక్క ప్రతి కదలిక కూడా మన బాడీ లాంగ్వేజ్ లో బాగమే. బాడీ లాంగ్వేజ్ అంటే నోటితో మాట్లాడకుండా మాట్లాడటం. మీ ఆలోచనలను, మీ ఫీలింగ్స్ ని, మీ ఎమోషన్స్ ని, మీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూనే వుంటుంది. మీరు కొన్ని ప్రాంతాలలో మూగ చేవిటి వారిని చూస్తే, వారు కొన్ని శరీర కదలికల ద్వార ఎన్నో విషయాలు వారు మాట్లాడుకుంటారు. వారికీ మాటలు రాకున్న కూడా రకరకాలుగా వారి చేతులను, హావభావాలను కదిలించడం ద్వార, వారు చెప్పాలనుకునే విషయాన్ని ఎదుటివారికి చెపుతారు. అలా మాటలు రాకున్న వారి భావాన్ని మాత్రం ఇతరులకు చేరేల చేస్తారు. అంటే మాట్లాడకుండా కూడా విషయాన్ని ఎదుటివారికి చెప్పవచ్చనే అర్ధం. అందుకే అంటారు పెద్దలు, మన మాటలకన్న మన చేతలు చాల శక్తివంతమైనవని.

ఫ్రండ్స్! ముఖ్యంగా మన బావవ్యక్తికరణలో మన బాడీ లాంగ్వేజ్ యొక్క ప్రబావం దాదాపు యాబై శాతం కన్నా ఎక్కువ ఉంటుందని ఎన్నో పరిశోదనలు తేల్చాయి. ఉదాహరణకి కమలహాసన్ మరియు అమల నటించిన పుష్పకవిమానం అనే సినిమాలో ఎలాంటి మాటలు లేకుండా వారి బాడీ లాంగ్వేజ్ ద్వారానే సినిమా కథని మొత్తం, దర్శకుడు ప్రేక్షకులకు కమ్యూనికేట్ చేసారు. అలా మాటలు లేని సినిమా అయిన కూడా ఎంతో విజయమంతంగా ఆ సినిమా నడిచింది. కాబట్టి మన సంభాషణలలో మనం చెక్ చేసుకోవాల్సింది మన బాడీ లాంగ్వేజ్, మన ఆలోచనలను వ్యక్తీకరిస్తుందా? లేదా అని చూసుకోవాలి. ఫ్రెండ్స్ మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ముక్యమైన సంభాషణలలో మీ బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెన్స్ చూపెడుతుందా లేక టెన్షన్ చూపెడుతుందా? మీ బాడీ లాంగ్వేజ్ మీకు సహాయపడుతుందా లేదా నష్టం తీసుకువస్తుందా తెలియాలంటే కొన్ని విషయాలు మనము ముందుగా అర్ధం చేసుకోవాలి, అవేంటో ఇప్పుడు చూద్దాము.

ముందుగా ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమి చెయ్యవద్దో తెలుసుకుందాము, దీనినే నెగటివ్ బాడీ లాంగ్వేజ్ అని అంటారు.

మొదటిది... చాలామందికి ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు తెలియకనే చేతులు కట్టుకోవడం అలవాటు వుంటుంది, ఇది స్కూల్ రోజులలో టీచర్ ముందు చేతులు కట్ట్టుకునే అలవాటు అయివుండవచ్చు, కానీ మన రోజు వారి సంబాషణలలో మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు..చేతులు కట్టుకొని వుండటం సరైన విధానం కాదు. అలా చేతులు కట్టుకున్నారు అంటే, ఎదుటి వ్యక్తి చెపుతున్న విషయాన్ని మీరు అంగీకరించడం లేదు, లేదా ఒప్పుకోవడం లేదు అని అర్ధం, కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీ చేతుల ఎక్కడ, ఎలా వాడుతున్నారు అనేది చాల ముఖ్యం.

రెండవది... మన బాడీ లాంగ్వేజ్ లో అత్యంత సున్నితమైన, ప్రబావవంతమైనవి మన ముఖ కవళికలు, మన ముఖ కవళికలలో మన మానసిక పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది, ముఖ్యంగా ఒక వ్యక్తి జాబు కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అతని మనసులో ఆందోళన వుంటే, అది స్పష్టం ఎదుటివ్యక్తికి కనపడుతుంది, ఆ విషయం ఇతనికి తెలియక పోవచ్చు. కానీ ఇంటర్వ్యూ చేసే వారు ఇతని బాడీ లాంగ్వేజ్ ద్వారానే ఎన్నో విషయాలు గ్రహిస్తారు.

మూడవది... మీ శరీరం ఎటు వైపు తిరిగి వుంది అనే విషయం చాల మీ గురించి, మీ ఆత్మ విశ్వాసం గురుంచి, మీ ఉత్సాహం గురించి చాల చెపుతుంది. ఇతరులతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ శరీరం వారి వైపు కాకుండ మరో వైపు తిరిగి వుండటం, మీ యొక్క నెగటివ్ బాడీ లాంగ్వేజ్కి సంకేతం.

నాలుగవది....బాడీ లాంగ్వేజ్ లో ఒక వ్యక్తి యొక్క కళ్ళు చాల విషయాలు చెపుతాయి, ముక్యంగా ఎదుటి వ్యక్తితో మీరు మాట్లాడుతున్నపుడు, వారి కళ్ళలో చూస్తూ మాట్లాడకుండా, ఏటో చూస్తూ మాట్లాడటం, లేదా చాల తక్కువగా కళ్ళలోకి చూసి మాట్లాడటం, ఇవన్ని కూడా మన ఆత్మవిశ్వాసం గురించి ఎదుటి వ్యక్తికి ఎంతో చెపుతాయి.

ఫ్రండ్స్ ఇప్పటివరకు ఏమి చెయ్యవద్దో చూసాము, ఇప్పుడు మన బాడీ లాంగ్వేజ్ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ అవ్వాలంటే ఏమి చెయ్యాలో చూద్దాం.

ముందుగా మన బాడీ లాంగ్వేజ్ ఓపెన్ బాడీ లాంగ్వేజ్ వుండాలి, అంటే మీరు ఇతరులతో మాటలడేప్పుడు మీ చేతులు కట్టుకోకుండా, మీరు చెపుతున విషయాన్ని బట్టి, దానికి అనుగుణంగా మీ చేతులు కదిలిస్తూ వుండాలి. వీలైనంత వరకు మీ హస్తాలు ఓపెన్ గా ఎదుటి వ్యక్తికి కనపడాలి. అలాగే మీరు ఎలా నిలబడ్డారు అనేది కూడా చాల ముక్యం, కాబట్టి వీలైనంత వరకు నిటారుగా మీ భంగిమ వుండాలి. ఇంకా మీ రెండు రెండు పాదాలు, మీ రెండు బుజాలకి సమాంతరంగా వుండాలి. అలాగే మీర రిలాక్స్డ్ వుండటం మరియు ఎదుటి వ్యక్తికి ముఖాముఖిగా నిలబడటం చాల ముఖ్యం. మీరు ఎదుటి వ్యక్తి చెప్పే విషయాన్నీ వింటున్నప్పుడు, మీ రెండు చేతులను రిలాక్స్డ్ గా సైడ్ కి వుంచడం అవసరం. అలాగే రెగ్యులర్ గా ఎదుటి వ్యక్తి కళ్ళలో చూస్తూ మాటలాడటం వలన మీ యొక్క ఆత్మవిశ్యాసం ఎదుటి వ్యక్తికి కనబడుతుంది.

మీ బాడీ లాంగ్వేజ్ ని తక్కువ సమయంలో మెరుగు పరుచుకోవడానికి...మీరు మీ ఇంట్లో ని అద్దం ముందు నిలుచొని, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నట్టు, లేదా కొద్దిమంది ముందు ఒక ప్రసంగం ఇస్తున్నట్టు ప్రాక్టీసు చెయ్యండి, అప్పడు మీ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ బాగా వుంది, ఎక్కడ ఇంకా మెరుగు పరచుకోవచ్చు మీకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మొబైల్ ఫోన్ సహాయంతో వీడియో రికార్డు చేసుకొని చూడండి, ఆ తర్వాత మీరు ఎ విషయంలో ఇంకా మెరుగు పరచుకోవలో ఆలోచించండి. ఇలా ఇప్పటి నుండి మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ లో కొన్ని మార్పులు చేసుకొని మాట్లాడండి, దాని ద్వారా వచ్చే ఎన్నో లాభాలు మీరు పొందుతారు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories