మీ వాయిస్ పవర్ ని ఇలా పెంచుకోవచ్చు?

మీ వాయిస్ పవర్ ని ఇలా పెంచుకోవచ్చు?
x
Highlights

ఫ్రెండ్స్, ఈ రోజు మనం చర్చించే అంశం.... మీ వాయిస్ పవర్ ని ఇలా పెంచుకోవచ్చు? ఫ్రెండ్స్, మన రోజు వారి జీవితంలో ఎంతోమందితో మనం మాట్లాడుతూ ఉంటాము....

ఫ్రెండ్స్, ఈ రోజు మనం చర్చించే అంశం.... మీ వాయిస్ పవర్ ని ఇలా పెంచుకోవచ్చు?

ఫ్రెండ్స్, మన రోజు వారి జీవితంలో ఎంతోమందితో మనం మాట్లాడుతూ ఉంటాము. మనకి ఇతరులకి మద్య సంభాషణ జరగడానికి ఉపయోగపడేది మన వాయిస్. మన గళమే, మన బావాన్ని ప్రకటిస్తుంది. అందుకే అంటారు..."కాగితంపై రాసి వున్నాపదాలకి, మానవ స్వరం తో ప్రాణం పోసి, వాటి ప్రభావాన్ని పెంచవచ్చు అని". అయితే మనం ఒకరితో ఒకరు మాట్లాడటానికైన, లేదా ఒక వక్తగా చాలా మంది ముందు నిలబడి మాట్లాడటానికైనా, మనకు మరియు మన ఆడియన్స్కి మధ్య ఉన్న ముఖ్యమైన వారధి మన వాయిస్. మనం చెప్పాలనుకున్న మెసేజ్ ని, మన ఆడియన్స్ చెవి వరకు చేరవేసే ముఖ్యమైన వాహనం మన వాయిస్. అందుకే అంటారు "మన వాయిస్ సంగీత వాయిద్యలన్నిటిలోనూ అత్యుత్తమమైనదని ".

ఫ్రెండ్స్! గొప్ప సంబాషణలు చేసేవారు, గాయకులు, వక్తలు, నటులు వారి వాయిస్ తోనే ఎన్నో విషయాలు మనకి చెపుతారు. అయితే సహజంగానే మన మిత్రునితో మాట్లాడుతున్నపుడు, అలాగే మన బాస్ తో మాట్లాడుతునప్పుడు మన వాయిస్ ఒకేలా ఉండదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని బట్టి మన వాయిస్ లో కొన్ని మార్పులు సహజంగానే సంభవిస్తాయి. కాని కొద్దిమంది వాయిస్ లో వారు కోరుకొనే భావాన్ని ప్రకటించలేరు. వారి వాయిస్ స్ట్రాంగ్ గా ఉండదు. కమాండింగ్ గా వారు మాట్లాడలేకపోతారు. అలాంటి వారు కొన్ని విషయాలలో సాధన చెయ్యడం ద్వార, వారు కోరుకునే విధంగా వారి వాయిస్ ని మలచుకోవచ్చు. అలా ఇతరులు వారి కళ్ళతో చూడలేని ఎన్నో విషయాలను మన నాలుక వారికీ చూపించగలదు.

ఫ్రండ్స్! మనం సమయాన్ని బట్టి, సందర్బాన్ని బట్టి, చెపుతున్న విషయాన్నీ బట్టి, మన వాయిస్ లో కొన్ని మార్పులు తీసుకొని రావాలి. లేకుంటే వినేవారికి చాల మొనాటనస్ గా, ఎలాంటి హెచ్చు తగ్గులు లేక బోరింగ్ అనిపిస్తుంది, వినేవారి మనస్సు మనం చెప్పే విషయం నుండి మరెక్కడికో..పోతుంది. అలా కావద్దు అంటే మన వాయిస్ లో బావప్రకటన, లేద ఎక్ష్ప్రెషన్ వుండాలి. దీని కోసం అసలు మన వాయిస్ ఎలా ఉంటుందో మనకి తెలియాలి. అయితే చాల మందికి వారి వాయిస్ ఇతరులకి ఎలా వినపడుతుందో వారికీ తెలియదు. కాని వారి కుటుంబ సభ్యుల వాయిస్ ఎలా వుంటుంది అంటే...దానిని గుర్తుకు చేసుకోగలరు, సినిమా హీరో చిరంజీవి వాయిస్ ఎలా వుంటుంది అంటే గుర్తుకి తెచ్చుకోగలరు, కాని వారి వాయిస్ ఎలా వుంటుంధో స్పష్టంగా వారు గుర్తుకి తెచ్చుకోలేరు.

కాబట్టి ముందుగా మన వాయిస్ ని, ఒక మొబైల్ ఫోన్ లో రికార్డు చేసుకొని, ఎలా వుంది, ఎలా వ్యక్తికరిస్తున్నాము అని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పద్దతులలో సాధన చెయ్యడం ద్వార మన వాయిస్ ని పవర్ఫుల్ చేసుకోవచ్చు. అయితే కొద్ది మంది అనుకుంటారు, మన వాయిస్ పుట్టుకతో వస్తుందని, అది ఎప్పటికీ అలాగే ఉంటుందని. కానీ వాస్తవం ఎంటంటే...మనం కొంత సాధన చేస్తే మన వాయిస్ లో కూడా మార్పు తీసుకురాగలము. ఎంతో మంది గాయకులు, నటులు, వక్తలు సాధన ద్వారా వారి వాయిస్ ని మెరుగుపరుచుకున్నారు. ఉదాహరణకి అమితాబచ్చన్ తన వాయిస్ మీద ఎంతో సాధన చేసి, ఈరోజు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

మన వాయిస్ మంచిగా, రిచ్ గా, ఎక్సైటింగ్గా, వినసొంపుగా ఉంటే మన ఆడియన్ ఇంట్రస్టింగా వింటారు. మన వాయిస్ శ్రోతల చెవులకు వినసొంపుగా లేకుంటే మాత్రం... మనం చెప్పేది ఎంత గొప్ప విషయం అయిన వారు అందుకోలేకపోతారు, అలాగే మన ప్రసంగంపై వారి అటెన్షన్ని ఉంచలేరు. మన వాయిస్ ని బట్టి, మన శ్రోతలు మన సందేశం, వినయ పూర్వకంగా ఉందా లేదా కూడా అర్ధం చేసుకోగలరు. కొన్ని సందర్భాలలో మనం చెప్పాలనుకున్న విషయం చాలా గట్టిగా, అంటే ఫోర్సుఫుల్గా కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మన వాయిస్ లో ఆ విషయం యొక్క శక్తి మరియు సాంద్రత కనబడాలి.

దానికోసం వాయిస్ మాడ్యులేషన్ లేదా వాయిస్ వ్యక్తికరణకి సంబంధించిన ముఖ్యమైన కొన్ని విషయాలపై పట్టు సంపాదించాలి. అందులో ఒకటి..స్వర వేగం, స్వర వేగం అంటే ఒక నిమిషానికి మన సంభాషణలో దాదాపు ఎన్ని పదాలు వాడుతున్నాము అని, రెండు.. నిశబ్ధం! నిశబ్ధం అంటే పాజ్ అని అర్ధం, మనం మన మాటలని, ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు ఆపాలనే విషయం. మూడు... స్వర స్థాయి ! స్వర స్థాయి అంటే మన వాయిస్ లోని ఎత్తు తగ్గులు. నాలుగు.. స్వర భావం! స్వర భావం అంటే మన స్వరం వినడం ద్వారా ఎదుటి వక్తికి, మనం ఏ భావావేశంలో ఉన్నామో తెలియటం. ఇలాంటి ఎన్నో విషయలు మీరు HMTV వారి "వక్త" అనే కార్యక్రమంలో కూడా నేర్చుకోవచ్చు.

అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది...మన వాయిస్ యొక్క క్వాలిటీకి మొదటి మెట్టు మన శ్వాస. మనం తీసుకున్న గాలే, మన వోకల్ కార్డ్స్ ద్వార శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి, అయితే ఆ శబ్దం మాటలుగా మారేది మాత్రం, మన స్పీచ్ ఆర్గాన్స్ ద్వార, లేదా గాత్ర అవయవాలు అని కూడా అంటాము. అవి మన పెదాలు, నాలుక, పళ్ళు, దవడ, అంగిలి. అయితే మన శ్రోతల నుంచి మన మాటలకూ, ప్రసంగాలకు మంచి స్పందన రావాలి అంటే, మన మాటలు ఎమోషనల్ గా కూడా మనం ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి, అలా అవ్వడం కోసం ఒక మంచి కథ, మంచి జోక్ లేదా కొటేషన్ లేదా ఒక డైలాగ్ చెప్పాలన్న కూడా వాయిస్ ఎక్స్ప్రెషన్ చాలా అవసరం.

అయితే మన మాటలు స్పష్టంగా పలకడం కోసం, వాయిస్ లో పవర్ పెరగటం కోసం రోజు కొన్ని టంగ్ ట్విస్టర్ని, మరియు కొన్ని క్లిష్టమైన శబ్దాలని ఎక్కువగా ప్రాక్టీసు చెయ్యాలి. ముఖ్యంగా రోజు ఏడూ నిముషాలు "ఓంకారాన్ని" ప్రాక్టీసు చెయ్యడం ద్వార, మన వాయిస్ లో ఎంతో మంచి మార్పు వస్తుంది. ఫ్రండ్స్ మీ వాయిస్ లో, మీరు కొరకునే మార్పులను సాధన ద్వార మీరు సాదించగలరు. సాదనతో అన్ని సాధ్యమే. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories