"పాజిటివ్ థింకింగ్ ఆలోచనల్లో కింగ్".

పాజిటివ్ థింకింగ్ ఆలోచనల్లో కింగ్.
x
Highlights

ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం "పాజిటివ్ థింకింగ్ ఆలోచనల్లో కింగ్". పాజిటివ్ థింకింగ్ ఒక అలవాటుగా మారితే సంతోషం మనతోనే సంతోషంగా ఉంటుంది. ఈ...

ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం "పాజిటివ్ థింకింగ్ ఆలోచనల్లో కింగ్".

పాజిటివ్ థింకింగ్ ఒక అలవాటుగా మారితే సంతోషం మనతోనే సంతోషంగా ఉంటుంది. ఈ విషయం వినడానికి చాలా సింపుల్ గానే అనిపించినా, మనం ప్రస్తుతం పాజిటివ్ థింకింగ్ ని ఒక అలవాటుగా చేసుకోవాలి. ఎందుకంటే ఆలోచించడం కూడా ఒక అలవాటే కాబట్టి. సాధారణంగా చాలా మంది ఆలోచించే విధానం ప్రతి రోజు వారికీ వచ్చే ఆలోచనల్లో, దాదాపు 80 % ఆలోచనలు రోజు వచ్చేవే వస్తాయట. అందుకే బుద్దుడు అంటారు..మన ఆలోచనలే మనం అని. ఈ ఆలోచనలని అర్ధం చేస్కుంటే, మనకి కావాల్సిన విధంగా మలచుకుంటే మనకి ఎన్నో లాభాలు వున్నాయి. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాము.

ఒకటి మనం పాజిటివ్ గా ఆలోచించడం అనే నిర్ణయం తీసుకోవడం వల్ల లా అఫ్ అట్రాక్షన్ని మనకి అనుకూలంగా వాడుకోవచ్చు. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ లో మొదటి సూత్రం లైక్ అట్రాక్ లైక్ అంటారు.. అంటే మన ఆలోచనలు ఎలా వున్నాయో, అలాంటి అనుభవాలను మనము ఆకర్షిస్తాము అని అర్ధం. కాబట్టి మన ఆలోచనలు చాలా ముఖ్యం. అందుకే పాజిటివ్ గా ఆలోచించడం ఒక అలవాటుగా మారితే ఎన్ని మంచి విషయాలు మీరు ఆకర్షించగలరు ఒక్కసారి ఆలోచించండి.

ఎప్పుడైతే మనం పాజిటివ్ గా ఆలోచించాలి అని నిర్ణయించుకున్టారో, అప్పటినుండి ఇతరులలోని పాజిటివ్ క్వాలిటీస్ని గుర్తించగలుగుతారు, అలాగే వారి యొక్క లోపాలను అంతగా పట్టించుకోరు. దీనివల్ల చాలా అర్థవంతమైన స్నేహ సంబంధాలను నిర్మించుకోగలుగుతారు. ఇలాంటి దృక్పథం వల్ల మీ చుట్టూ కూడా ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. మీరు పాజిటివ్ థింకింగ్ ని ఒక ప్రాముఖ్యమైన విషయంగా నిర్ణయించుకుంటే మీరు ఇతరుల ముందు మంచి ఫస్ట్ ఇంప్రెషన్ లేదా మొదటి అభిప్రాయం ఏర్పరుచుకోగలరు. సహజంగానే వ్యక్తులు ఎవరైతే చాలా kind గా ఫ్రెండ్లీ గా ఉంటారో వారికి ఆకర్షితులవుతారు మీ ఫస్ట్ ఇమ్ప్రేస్సన్ వల్ల భవిష్యత్తులో కూడా మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి.

ఆనందంగా,హెల్తీగా ఉండటానికి కూడా పాజిటివ్ థింకింగ్ సహాయపడుతుంది. మన ఆరోగ్యం బాగా ఉండటానికి ఒక అమృతంలా ఇది పంసిచేస్తుంది. పాజిటివ్ గా ఆలోచించడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎలాంటి డిప్రెషన్ లాంటి వాటికి ఎక్కువగా గురి కారని ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి. అలాగే చాలామంది అనారోగ్యానికి కారణం చాల వరకు సైకోసోమాటిక్ వ్యాధులకి ఆ వ్యక్తి ఆలోచనలే కారణం అని పరిశోధకులు అంటున్నారు, కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటానికి ఈ పాజిటివ్ ఆలోచనలు చాలా అవసరం.

సక్సెస్ కి లాంటిది పాజిటివ్ థింకింగ్. ఎందుకంటే ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో, అప్పుడు మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. అలా లక్ష్యం వైపు అడుగులు వేయడం ద్వారా విషయం మీకు సులభంగా సాధ్యమవుతుంది. అలాగే విజయం సాధ్యమే అనే నమ్మకం కూడా మీ పాజిటివ్ ఆలోచనపైనే ఆధారపడివుంటుంది, అందుకే పాజిటివ్ గా ఆలోచించండి విజేతలుకండి.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా పాజిటివ్ థింకింగ్ చాలా సహాయపడుతుంది అలాగే మన ఒత్తిడికి మన బెంగకి ముఖ్య కారణం మన నెగిటివ్ ఆలోచనలు, అలాగే ఈ ఒత్తిడి గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు ఒత్తిడి ఎలాంటి సహాయం చేయదు, అలాగే ఈ ఒత్తిడి మన సమస్యలను తీర్చడానికి బదులు మానని నిస్సహాయులు చేస్తుంది అని గుర్తించాలి. మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలెట్టగానే ఒత్తిడిని త్వరగా అధిగమిస్తారు. అలాగే మీ జీవితంలో పాజిటివ్ ఆలోచనలు శాతం పెరగగానే ఒత్తిడి మీకు దాదాపు దూరమైపోతుంది.

పాజిటివ్ గా ఆలోచించడం వల్ల మన ముందు వున్నా ఇబ్బంది, లేదా సమస్య కూడా మన అభివృద్దికి ఒక మంచి అవకాశముగా కనబడతాయి. నెగిటివ్ ఆలోచనలు మన కళ్ళను మూసివేస్తాయి. ఒక్కసారి నెగటివ్ నుండి పాజిటివ్ గా మన ఆలోచనలు మార్చుకో గానే ఒక గ్లాసులోని నీరు సగం ఖాళీ ఉంది అనే బదులు ఆ గ్లాసులో సగబాగం నీటితో నిండిఉంది అని చూడగలుగుతాము. అలా ఒక్కసారి సమస్య నుండి పరిష్కారం వైపు మన ద్రుష్టి మారుతుంది, ఆ తర్వాత ఎ సమస్య అయిన ఒక అవకాశంగా మార్చుకోగలిగే వైపు మనం ఎదుగుతాం. అలా ఎదగడానికి మంచి దారి పాజిటివ్ గా ఆలోచించడం, దీనివల్ల ఏదైనా లక్ష్యాన్ని మనం సాధించగలం.

ఒకసారి ఆలోచనలు పాజిటివ్గా కాగానే మన జీవితంలో ఎన్నో అనంతమైన విషయాలు మనకి అందుబాటులో ఉన్నాయి అనిపిస్తుంది. ఎన్నో మంచి విషయాలు కనబడతాయి. అలాగే మన జీవితం లో మనం ఎంత అదృష్టవంతులమో గుర్తిస్తాము. నెగిటివ్గా ఉంటే మన దగ్గర ఎన్ని గొప్ప విషయాలు ఉన్నా వాటిని మనం గుర్తించలేము. అలాగే చాలామంది లా లేనిదాని గురించి కంప్లైంట్ చేస్తూ వుంటే, ఉన్నదాన్నిగుర్తించుకుంటే గౌరవించకుంటే పూర్తి కృతజ్ఞతాభావంతో లేకుంటే అవి కూడా వెళ్లిపోతాయి. కాబట్టి మీ దగ్గర ఉన్న మంచి విషయాలని గుర్తించి గౌరవించి కృతజ్ఞతతో వుండటం వల్ల ఇంక ఎన్నో మంచి విషయాలని మీ జీవితంలోకి మీరు ఆకర్శిన్చగలుగుతారు. కాబట్టి మీ జీవితలో వున్నా బ్లెస్సింగ్స్ని గుర్తించి కృతజ్ఞతాభావంతో ఉండటానికి పాజిటివ్ ఆలోచనలు సహాయపడతాయి.

పాజిటివ్ గా ఆలోచించడం వల్ల మీ మోటివేషన్ కూడా పెరుగుతుంది అలాగే రోజు మీ లక్ష్యం వైపు పని చేస్తూ ఉంటారు. ఇలా మంచి మోటివేషన్ ఉండడం ఒక పక్షికి వుండే రెక్కలా మీకు చాలా సహాయపడుతుంది.

పాజిటివ్గా ఆలోచించే వారు అందంగా,ఆకర్షణీయంగా కనపడతారు. ఇది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే పాజిటివ్ గా ఆలోచించే వారు చిరునవ్వుతో ఉండడం వల్ల, స్నేహంగా ఉండడం వల్ల, సంతోషంగా ఉండడం వల్ల చాలామంది వీరికి ఆకర్షించబడతారు. వీరి ఆలోచనవల్ల అంత సౌందర్యమే వారి బాహ్య సౌందర్యంగా మారుతుంది. అందుకే అబ్రహం లింకన్ అంటారు "గులాబీ పొదలకు ముళ్ళు ఉన్నాయని బాధపడదామా లేక ముళ్ళ పొదలకు గులాబీలు వచ్చాయని సంతోష పడదామా" అని అడుగుతారు. కాబట్టి పాజిటివ్గా ఆలోచించి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండవచ్చు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories