ZyCoV-D: దేశంలో అందుబాటులోకి మరో టీకా

Zydus Cadilas COVID-19 Vaccine ZyCoV-D Gets Emergency Approval
x

ZyCoV-D: దేశంలో అందుబాటులోకి మరో టీకా

Highlights

ZyCoV-D: దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు రెడీ ఉన్నట్టు తెలుస్తోంది.

ZyCoV-D: దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు రెడీ ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్ -డి టీకాకు నిపుణుల కమిటీ ఓకే చెప్పింది. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థకి సిఫార్సులు చేసింది. ఈ టీకాకు 66.6 శాతం సమర్ధత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. డీఎన్ఏ సాంకేతికతతో జైడస్ క్యాడిలా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా అయితే 12 ఏళ్ల పైబడిన వారిపై తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అనుమతులు వచ్చాక ఏటా 24 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories