Modi On Asian Games: అక్టోబర్ 10న ఏషియా భారత క్రీడాకారుల ప్లేయర్లను కలుస్తా
Modi On Asian Games: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్స్ దుమ్మురేపుతున్నారు. చైనాలోని హంగ్జూ వేదికగా జరుగుతోన్న ఏషియా క్రీడల్లో భారత ప్లేయర్స్ పతకాల పంటను పండిస్తున్నారు. ఈసారి భారత ప్లేయర్స్ ఏకంగా 100 పతకాలు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. భారత ఆటగాళ్లు ఈ అద్భుతాన్ని సాకారం చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ప్రధాని.. ప్లేయర్స్‌ను ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత విజయం సాధించిందని తెలిపారు ప్రధాని.
భారత్ 100 పతకాల మైలు రాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భారత్ ఈ చారిత్రాత్మక మైలురాయిను సాధించడానికి కారణమైన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇక అక్టోబర్ 10వ తేదీన ఆసియా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను ప్రధాని కలవనున్నారు. దేశ ఖ్యాతిని పెంచిన క్రీడాకారులతో మాట్లాడడానికి తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
A momentous achievement for India at the Asian Games!
— Narendra Modi (@narendramodi) October 7, 2023
The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals.
I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire