Bharat Jodo Yatra: రాహుల్‌ గాంధీని చూసి యువతి భావోద్వేగం

Young woman is emotional seeing Rahul Gandhi
x

Bharat Jodo Yatra: రాహుల్‌ గాంధీని చూసి యువతి భావోద్వేగం

Highlights

Bharat Jodo Yatra: రాహుల్‌ను పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చిన యువతి

Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను చూసి ఓ యువతి తీవ్ర భావోద్వేగానికి గురైన సంఘటన సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. జోడో యాత్ర కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాహుల్‌ గాంధీ వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేరళలో యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో 18వ రోజు కేరళలోని పండిక్కాడ్‌లోని స్కూల్‌ వద్ద ఉదయం పాదయాత్ర మొదలైంది. అయితే వండూరు జంక్షన్‌లో విరాం కోసం ఆగారు. తిరిగి యాత్ర ప్రారంభించిన సమయంలో రాహుల్‌ గాంధీ వద్దకు ఓ యువతి వచ్చింది. రాహుల్‌ను చూసిన ఆనందంలో చిన్నపిల్లలా గెంతులు వేసింది. రాహుల్‌ను కలిశానన్న అవధుల్లేని ఆనందంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. ఆమె రాహుల్‌ను చూసి బావోద్వేగంతో ఏడుపును ఆపుకోలేకపోయింది.

రాహుల్‌తో పాటు యాత్రలో ఉన్నవారంతా యువతి చర్యను చూసి ఆశ్యర్యంతో నవ్వారు. అయితే రాహుల్‌ మాత్రం ఆ యువతి భావోద్వేగాన్ని కంట్రోల్‌ చేస్తూ ఆమెను దగ్గరకు తీసుకుని సముదాయించారు. వాస్తవానికి తమ ఆరాధ్య దైవంగా భావించే హీరో, హీరోయిన్లు వచ్చినప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి క్రేజీ ఫీలింగ్‌ రాహుల్‌ గాంధీ పాదయాత్రలో ఎదురవ్వడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. రాహుల్‌ గాంధీకి అంత క్రేజ్‌ ఉందా? అని నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ జోడో యాత్ర 21వ రోజుకు చేరుకుంది. తాజాగా కేరళలోని మలప్పురం జిల్లాలోని పండిక్కాడ్‌లో యాత్ర ప్రారంభమై రాహుల్‌ సొంత లోక్‌సభ నియోజకవర్గం వాయ్‌నాడ్‌లోకి ప్రవేశించింది.

ఉదయం ప్రారంభమైన యాత్ర 11 కిలోమీటర్ల మేర సాగి వాండూర్‌ జంక్షన్‌ వద్ద ఆగింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలతో పాటు పలువురు రైతులతో మాట్లాడారు. రాహుల్‌ జోడో యాత్ర 21వ రోజుకు చేరుకుంది. సెప్టెంబరు 10న తమిళనాడు నుంచి కేరళలో ప్రవేశించిన ఈ యాత్ర అక్టోబరు 1న కర్ణాటకకు చేరనున్నది. 19 రోజుల వ్యవధిలో ఏడు జిల్లాల మీదుగా 450 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో భారత్‌ జోడో యాత్ర సాగనున్నది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర 150 రోజుల పాటు సాగనున్నది. ఈ యాత్ర మొత్తం 3వేల 570 కిలోమీటర్ల మేర సాగనున్నది. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో జోడో యాత్రను రాహుల్‌ గాంధీ ప్రారంభించిన ఈ పాదయాత్ర జమ్మూ కశ్మీర్‌లో ముగుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories