SBI: చిరిగిన కరెన్సీ నోట్లను మార్చాలనుకుంటున్నారా..! ఇలా చేయండి..
SBI: మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉంటే ఎటువంటి ఆందోళన చెందవద్దు
SBI: మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉంటే ఎటువంటి ఆందోళన చెందవద్దు. మీరు బ్యాంకుకు వెళ్లి సులభంగా ఈ నోట్లను మార్చుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ విషయాన్ని వెల్లడించింది. SBI ట్విట్టర్‌లో ఒక వినియోగదారుడి ప్రశ్నకు స్పందించింది. పూర్తిగా దెబ్బతిన్న లేదా కొద్దిగా చెడిపోయిన కరెన్సీ నోట్లు, అన్ని రకాల చెడిపోయిన నోట్లను బ్యాంకులోని అన్ని శాఖలలో మార్చుకోవచ్చని ప్రకటించింది.
SBI ప్రకారం.. బ్యాంకు ఖాతాదారుల కోసం కరెన్సీని మార్చుకునే సదుపాయం ప్రవేశపెట్టింది.ఈ విషయంలో బ్యాంకు ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరిస్తుందని తెలిపింది. దెబ్బతిన్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిందని ఇందులో ఎలాంటి అనుమానాలు, మోసాలకు తావు ఉండదని బ్యాంక్ వివరించింది. బ్యాంక్‌కి సంబంధించి అన్ని శాఖలు స్వేచ్ఛగా మ్యుటిలేటెడ్ కరెన్సీ నోట్లను, చిరిగిన నోట్లను తీసుకుంటాయి. ఖాతాదారులకు కొత్త నోట్లను అందిస్తాయి.
దెబ్బతిన్న నోట్ల కోసం RBI మార్గదర్శకాలు
పాడైపోయిన నోట్లలో కొన్ని చిరిగినవి, మరికొన్ని కట్ అయినవి ఉంటాయి. అయితే అటువంటి నోట్లను ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్‌ని సందర్శించి మార్చుకోవచ్చు. అంతేకాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఏదైనా ఇష్యూ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా కూడా మార్చవచ్చు. దీని కోసం ఎలాంటి ఫారమ్ నింపాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ నోట్ల వాపసు విలువ RBI (నోట్ రీఫండ్) నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
All the branches of the Bank will exchange freely soiled/slightly mutilated currency notes and certain other types of mutilated currency notes of all denominations. The Bank's currency chest branches will exchange all categories of mutilated currency notes. Currency (1/2)
— State Bank of India (@TheOfficialSBI) November 12, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire