Yellow Fungus: యెల్లో ఫంగస్.. యమా డేంజర్..!

Yellow Fungus Infection Cases Reported India | Live News Updates Today
x

యెల్లో ఫంగస్ (ఫొటో ట్విట్టర్)

Highlights

ఓ పక్క కరోనా దశల వారీగా దడ పుట్టిస్తుంటే.. మరోపక్క ఫంగస్‌లు మనిషి ప్రాణాలను తీసేస్తూ భ‍యభ్రాంతులకు గురిచేస్తోంది.

Yellow Fungus: ఓ పక్క కరోనా దశల వారీగా దడ పుట్టిస్తుంటే.. మరోపక్క ఫంగస్‌లు మనిషి ప్రాణాలను తీసేస్తూ భ‍యభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్, వైట్ ఫంగస్‌లు ముప్పేటా దాడి చేస్తున్నాయి. అయితే, తాజాగా మరో ఫంగస్ వెలుగులోకి వచ్చింది. యెల్లోఫంగస్‌ రూపంలో రానున్న ఈ ముప్పు.. మిగతా రెండింటికన్నా చాలా డేంజర్‌ అంటున్నారు డాక్టర్లు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలి కేసును గుర్తించారంట డాక్టర్లు. ప్రస్తుతం ఈ ఫంగస్‌ సోకిన బాధితుడిని యూపీలోని ప్రసిద్ధ ఈఎన్‌టీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

లక్షణాలు..

బద్ధకం, ఆకలి తక్కువగా ఉండటం లేదా అసలు ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ప్రధానంగా యెల్లో ఫంగస్‌లో కనిపిస్తున్నాయంట. ఇది తీవ్రమైతే చీము కారడం, శరీరం మీద ఉన్న గాయాలు, లోపలి గాయాలు నెమ్మదిగా మానడం, పోషకాహార లోపం, అవయవాలు వైఫల్యం చెందుతాయంట. ఇక చివరికి నెక్రోసిస్ కారణంతో కళ్ళు పోతాయంటున్నారు డాక్టర్లు.

యెల్లో ఫంగస్ చాలా ప్రమాదాకరమైన వ్యాధి.. ఎందుకంటే ఇది శరీరంలోపల మొదలవుతుంది. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే.. వెంటనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు డాక్టర్లు.

కారణాలు..

యెల్లో ఫంగస్ అపరిశుభ్ర వాతావరణం వల్ల వ్యాప్తిస్తుంది. కనుక ఇంటిని.. చుట్టుపక్కల పరిసరాలను సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నివారించడానికి మిగిలిపోయిన ఆహారాలు, మల పదార్థాలను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. మన ఇళ్లలో ఉండే తేమ.. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను పెంచుతుంది. కాబట్టి ఇంటిని సాధ్యమైనంత పొడిగా ఉంచుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories