ముందుగా 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లకు ఉచితంగా టీకా : ప్రధాని మోడీ

workers to be vaccinated first: PM Modi
x
Highlights

జనవరి 16 నుంచి భారత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రధాని మోడీ తెలిపారు. వైద్య శాఖ అనుమతి ఇచ్చిన రెండు టీకాలు...

జనవరి 16 నుంచి భారత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రధాని మోడీ తెలిపారు. వైద్య శాఖ అనుమతి ఇచ్చిన రెండు టీకాలు మేడ్ ఇండియా అని ఆయన గుర్తు చేశారు. త్వరలో మరో నాలుగు టీకాలు అందుబాటులోకి రానున్నాయని సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీని అందరూ కలిసి విజయవంతం చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ముందుగా టీకాను 3 కోట్ల మంది ఫ‌్రంట్ లైన్ వర్కర్స్ కు ఇస్తామన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ పంపిణీపై చర్చించారు. తొలిదశలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వడమే లక్ష్యమన్న ప్రధాని వ్యాక్సిన్ పై పుకార్లను నమ్మవద్దని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories