మహిళలే మహారాణులు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Women Reservation Bill Takes Centre Stage in Parliament Special Session
x

మహిళలే మహారాణులు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Highlights

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్లకు సంబంధించి.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్లకు సంబంధించి.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల వేళ.. ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దకావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోడీ సారథ్యంలోని కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories