Haryana: ప్రజలను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై ఆగ్రహం
Haryana: హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌పై ఓ మహిళ చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇటీవల కురిసిన వర్షాలకు ఘగ్గర్ నదిపై ఉన్న డ్యామ్ దెబ్బతినడంతో ఘులా ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. అయితే అక్కడి ప్రజలు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను చూట్టుముట్టారు. తమ దీనస్థితికి ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో ఓ మహిళ అకస్మాత్తుగా అక్కడకు వచ్చి.. ఇప్పుడెందుకు వచ్చావ్ అంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంప చెళ్లుమనిపించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎమ్మెల్యే చుట్టూ రక్షణగా నిలిచారు. కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ స్పందించారు. మహిళపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోబోనని తెలిపారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire