Woman Mortgages Mangalsutra For Kids Education :పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం మంగ‌ళ‌సూత్రం తాక‌ట్టు పెట్టేసింది!

Woman Mortgages Mangalsutra For Kids Education :పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం మంగ‌ళ‌సూత్రం తాక‌ట్టు పెట్టేసింది!
x
Woman Mortgages Mangalsutra For Kids Education
Highlights

Woman Mortgages Mangalsutra For Kids Education : కరోనా ఎఫెక్ట్ అందరిపైన పడింది. ఇక విద్యాసంస్థలు కూడా బంద్ అయిపోయాయి. దీనితో చాలా స్కూల్స్

Woman Mortgages Mangalsutra For Kids Education : కరోనా ఎఫెక్ట్ అందరిపైన పడింది. ఇక విద్యాసంస్థలు కూడా బంద్ అయిపోయాయి. దీనితో చాలా స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లల చదువుకోసం ఓ తల్లి తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని గదగ్‌ జిల్లా నగ్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కస్తూరి చల్వాది అనే మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త కూలీ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. లాక్ డౌన్ వలన డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు.

మరోపక్కా పిల్లలకు దూర్‌‌దర్శన్‌లో పాఠాలు వినేందుకు ఇంట్లో టీవీ లేకపోవడంతో బాగా కష్టం అయిపొయింది. ఎలాగైనా సరే తన పిల్లల చదువు ఆగిపోకూడదు అనుకున్నా ఆ తల్లి తన 12 గ్రాముల మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో టీవీ కొన్నది. ఈ విషయం గ్రామస్తులకి తెలియడంతో తోచినంత సాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఈ న్యూస్ అక్కడ ఇక్కడ తెలిసి వైరల్ కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ రూ. 50 వేలు, రాష్ట్రానికి చెందిన మరో మంత్రి రూ. 20 వేల చొప్పున ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా కస్తూరి చల్వాది మాట్లాడుతూ.. "పిల్లలకు దూర్‌‌దర్శన్‌లో పాఠాలు చెప్తున్నారు. మాకు టీవీ లేదు. టీచర్లు కూడా పాఠాలను దూర్‌‌దర్శన్‌లో వినాలని చెప్పారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీవీ కొనేందుకు నిర్ణయం తీసుకున్నాను. ముందుగా అప్పు తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాము కానీ ఎవరు ముందుకు రాలేదు. దీనితో మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టక తప్పలేదు అని చెప్పుకొచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories