మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి భర్త అంత్యక్రియలు పూర్తి చేసిన భార్య

మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి భర్త అంత్యక్రియలు పూర్తి చేసిన భార్య
x
Highlights

మంగళసూత్రాన్ని కుదువ పెట్టి భర్త అంత్యక్రియలు పూర్తి చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. కరోనా విధుల్లో పాల్గొంటూ అంబులెన్స్‌ డ్రైవర్‌...

మంగళసూత్రాన్ని కుదువ పెట్టి భర్త అంత్యక్రియలు పూర్తి చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. కరోనా విధుల్లో పాల్గొంటూ అంబులెన్స్‌ డ్రైవర్‌ మరణించారు.. దాంతో అంత్యక్రియలకు డబ్బులు లేక డ్రైవర్ భార్య మంగళసూత్రాన్ని కుదువపెట్టింది. అయితే ఆమె దయనీయ స్థితిని చూసిన ముఖ్యమంత్రి ప్రభుత్వం తరుఫున సహాయం ప్రకటించారు. గదగ్‌ జిల్లా కొన్నూర్‌ కు చెందిన ఉమేష్‌ హదగలి, జ్యోతి దంపతులు.. వారికి ఇద్దరు పిల్లలు.. చాలా రోజులుగా పేదరికంతో మగ్గిపోతున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ఉమేష్ అంబులెన్స్‌ డ్రైవర్‌ గా పనిచేస్తున్నారు. గత రెండు నెలలుగా కరోనా విధుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తూ ఇటీవల గుండెపోటుతో మరణించారు. దాంతో ఉమేష్ కుటుంబం పెను విషాదంలో మునిగిపోయింది.

ఈ క్రమంలో అంత్యక్రియలు చేయడానికి బంధువులెవరూ సహాయం చెయ్యలేదు. దాంతో చేసేదేమి లేక ఉమేష్‌ భార్య జ్యోతి తన మంగళసూత్రాన్ని కుదువపెట్టి వచ్చిన డబ్బుతో భర్త అంత్యక్రియలు పూర్తిచేసింది. అన్తకాదు తమ దయనీయ దుస్థితి ప్రభుత్వానికి తెలిసేలా ఒక వీడియోను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో కర్ణాటక సీఎం యడియూరప్ప వరకూ చేరింది. వెంటనే స్పందించిన సీఎం జ్యోతితో మాట్లాడి.. ఉమేష్ మృతికి బీమా వచ్చేలా చేస్తానని చెప్పడం తోపాటు.. ప్రభుత్వం నుంచి రావలసిన పరిహారం అందచేస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories