Winter Session Of Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..16 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

Winter Session Of Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..16 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
x
Highlights

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి.

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 26న ఉభయసభలకు సెలవు ఉంటుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభా వ్యవహారాల సంఘం నిర్ణయించిన అంశాల ప్రకారం మిగిలిన రోజుల్లో సమావేశాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పార్లమెంటరీ వ్యవహాల శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 30 పార్టీలకు చెందిన 42 మంది నేతలు హాజరయ్యారు.

అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతితో కలిసి ప్రజలు రాజ్యాంగ పీఠికను చదువుతారని, రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను పుస్తకరూపంలో ప్రజలకు అందిస్తామని తెలిపారు. రాజ్యాంగం సాధారణ పుస్తకం కాదని.. అందులో ఉన్న చిత్రాలు, వర్ణనలు, ప్రధానుద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశాల్లో మొత్తం 17 బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది. వక్ఫ్‌ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ సమావేశాల తొలి వారంలో సభ ముందుకు వస్తుందా... లేదా చూడాల్సి ఉంది.

మరోవైపు అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అఖిలపక్ష సమావేశంలో ఈ డిమాండ్ ను కాంగ్రెస్ ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్ సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు. మణిపూర్ హింసపై కూడా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేయకుండా సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories